వైసీపీ పరీస్థీతి ఇదే… ఇంత చేసినా లాభం లేదు..

చుట్టూ చీకటి అలుముకుంటుంది.చేసిన తప్పులు వెంటాడుతున్నాయి.తీసుకున్న చెత్త నిర్ణయాలకు కోర్టులు మొట్టికాయిలు వేసి బొప్పికడుతుంది.జగన్ ముఖ్యమంత్రి అయ్యి 9 నెలలు అయినా ప్రశాంతంగా పడుకున్న రోజు లేదు.కేసుల మాఫీ కోసం 7 సార్లు ఢిల్లీకి వెళ్లి కాళ్ల మీద పడ్డా కనికరించడం లేదు.కోర్టు కి వ్యక్తిగత హాజరు నుండి మినహాయించాలి అని కోర్టు మెట్లు ఎక్కినా ఫలితం దక్కలేదు.సీబీఐ నేరగాడు ముఖ్యమంత్రి అయినా రాజ్యాంగం ఒక్కటే కోర్టు కి రావాల్సిందే అని తన వాదన వినిపించింది.అక్కడితో అయిపోలేదు మరో ముందగుడు వేసింది.దేశంలోనే అత్యంత అవినీతి పరుడుగా జగన్ ని సుప్రీం కోర్టు అభివర్ణించింది.ముఖ్యమంత్రి హోదాలో అయన సాక్షులను బెదిరించే అవకాశం ఉంది అని కూడా వాదించింది.అంటే సీన్ క్లియర్ గా అర్ధం అవుతుంది త్వరలోనే బెయిల్ రద్దు పిటిషన్ సీబీఐ వెయ్యబోతుంది.అందుకే జగన్ ఇప్పటికి 7 సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

 

అంతే కాక 9 నెలల్లో జగన్ ముఖ్యమంత్రి గా సాధించింది కూడా ఏమి లేదు.తీసుకున్న ప్రతి నిర్ణయానికి కోర్టు మొట్టికాయలు.ఆఖరికి చంద్రబాబు నిర్మించిన పంచాయతీలకు వైకాపా రంగులు వేసినా కోర్టు చివాట్లు పెట్టింది దింతో జగన్ బ్యాచ్ కి నిరుత్సాహం వచ్చింది.డప్పు కొట్టాడనికి ఏమి దొరకడం లేదు ఈ లోపు దేశంలో జరిగిన ఐటీ రైడ్స్ జగన్ పేటిఎం బ్యాచ్ కి ఆక్సిజన్ ఇచ్చాయి.చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో ఐటీ రైడ్స్ అనగానే సాక్షి లో వార్తలు రాస్తే నమ్మరు అని సోషల్ మీడియా లో ఉన్న సాక్షి దొంగ వెబ్ సైట్స్ లో వార్తలు రాయించారు.చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో వేల కోట్లు దొరికేసాయి అంటూ ఎక్కడో ఐటీ రైడ్స్ జరిగిన ఫోటోలు జత చేసి పులిహోర కలిపేశారు.సాక్షి ఫోటో గ్రాఫర్లు,రిపోర్టర్లు 30 మంది చంద్రబాబు మాజీ పీఎస్ ఇంటి ముందు 6 రోజులు 24/7 గస్తీ కాసారు.తీరా ఆ ఇంట్లో ఉన్న 2 లక్షలే అవి కూడా ఐటీ వాళ్లు తీసుకెళ్లలేదు అని తెలిసి సాక్షి బృందం డక్ అవుట్ అయినా బ్యాట్స్ మెన్ లా వెనుదిరిగింది.దేశ వ్యాప్తంగా అనేక చోట్ల ఐటీ రైడ్స్ చేసి 40 చోట్ల ఐటీ రైడ్స్ జరిగితే దొరికింది 85 లక్షలు.దానికి బ్రహ్మాండం బద్దలైనట్టు వైకాపా బ్యాచ్ రెచ్చిపోయింది.జగన్ ఒక్కడే దొంగ కాదు చంద్రబాబు కూడా జగన్ లా దొంగే అని చెప్పాలని తెగ ట్రై చేసింది.ఐటీ వాడు ఇచ్చిన ప్రెస్ నోట్ సరిగ్గా చదవకుండా 2 వేల కోట్లు దొరికేసాయి అవి కూడా జగన్ కి ఇచ్చేయాలి అంటూ హడావిడి మొదలు పెట్టారు.అసలు ఇన్ఫ్రా కంపెనీల పై దాడులు జరిగితే అవి టిడిపి కి ఎం సంబంధం.అవే కంపెనీలకు రివర్స్ టెండరింగ్ లో జగన్ పనులు ఎలా అప్పజెప్పాడు.ఎన్నికల్లో ఒక్కో అభ్యర్ధికి 20 కోట్లు జగన్ పంపారు అని ఉండి లో పోటీ చేసిన వైకాపా అభ్యర్థి బహిరంగంగా చెప్పాడు.

 

మరి అంత డబ్బు జగన్ కి ఏ ఇన్ఫ్రా కంపెనీలు ఇచ్చాయి.తీగ లాగితే డొంక కదిలినట్టు జగన్ ఎన్నికల్లో పెట్టిన ఖర్చు తాలూకు మతలబు ఈ ఐటీ రైడ్స్ ద్వారా బయటపడింది.ఇన్ఫ్రా కంపెనీల్లో లోతుగా విచారణ చేస్తే డబ్బు అంతా ఎన్నికల్లో జగన్ కి చేరిన విషయం దానికి ప్రతిఫలంగా జగన్ రివర్స్ టెండరింగ్ లో వారికీ పనులు అప్పజెప్పడం బయటపడుతుంది.అందుకే ఈ లోపు చంద్రబాబు కి ఆ డబ్బు వెళ్లింది అని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని వైకాపా పేటిఎం బ్యాచ్ కి 3 కోట్లు రిలీజ్ చేసాడు జగన్.ఐదు రూపాయిలు పడటంతో దొరికిన 2 లక్షలు కాస్తా 2 కోట్లు అయ్యి సామాజిక మాధ్యమాలను చుట్టేస్తోంది

"
"