ఢిల్లీ నుంచి వచ్చేయమని వైసీపీ ఎంపీల‌కు ఆదేశాలు… ఐ డోన్ట్ కేర్‌..!

మీరు ఎవరితోనూ ఒంటరిగా వెళ్లి మాట్లాడొద్దు… విజయసాయి అనుమతి లేకుండా అసలు హోటల్ నుంచి కూడా బయటకు రావొద్దు… ఎవరిని కలిసినా సరే విజయసాయి అనుమతి తీసుకోవాలి… ప్రతీ ఎంపీ కూడా ఎక్కడ ఉన్నారు ? ఏం చేస్తున్నారు అనే సమాచారం విజయసాయికి, మిథున్ రెడ్డికి తప్పకుండా ఇవ్వాలి… ప్రధానిని అమిత్ షా ని అసలు కలిసే ప్రయత్నం కూడా చేయవద్దు… అంటూ పార్లమెంట్ సమావేశాలకు ముందు ఢిల్లీ విమానం ఎక్కే వైసీపీ ఎంపీలతో సమావేశం అయిన ముఖ్యమంత్రి జగన్… చేసిన వ్యాఖ్యలు ఇవి..అసలు నన్ను దాటి ఏం చేసినా షోకాజ్ నోటీసు ఇవ్వడానికి కూడా వెనుకాడే పరిస్థితి ఉండదు అంటూ వార్నింగ్ ఇచ్చారు.

అయినా సరే ఒక్క ఎంపీ కూడా జగన్ మాటను లెక్క చేసినట్టు కనపడలేదు అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. విజయసాయి పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యే ముందు ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 14 మంది ఎంపీలు డుమ్మా కొట్టారు. దీనిని అధికారిక మీడియాలో ఎంత వరకు కవర్ చేసినా సరే… జనాలకు అర్ధమయ్యే రీతిలో అర్ధమైంది. ఇక సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద ప్రచారమే జరిగింది.ఇటీవల జగన్ తానే స్వయంగా ఢిల్లీ వెళ్ళారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం చెప్పడానికి గాను కొంత మంది ఎంపీలే విమానాశ్రయానికి వచ్చినట్టు సమాచారం. ఇక పార్లమెంట్ సమావేశాల్లో ఎవరో ఒకరు ఎంపీ ఎవరో ఒకరు కేంద్ర మంత్రినో బిజెపి ఎంపీలనో కలవడం అనేది పరిపాటిగా మారిపోయింది. ఇటీవ‌ల ఓ వైసీపీ ఎంపీ కేంద్ర మంత్రికి ఇచ్చిన విందుకు మ‌రో ఇద్ద‌రు వైసీపీ ఎంపీలు కూడా వెళ్లార‌ట‌. ఈ విష‌యం కూడా జ‌గ‌న్‌కు తెలియ‌డంతో జ‌గ‌న్ మ‌రింత ఫైర్ అవుతున్నార‌ట‌.

ఎంపీల తీరుపై ఆగ్రహంగా ఉన్న జగన్… త్వరలోనే ఎంపీలు అందరూ ఆంధ్రప్రదేశ్ వచ్చేయాలని… సంక్షేమ కార్యక్రమాల పేరుతో నియోజకవర్గాల్లో తిరగాలని సూచించినట్టు సమాచారం. ఇక విజయసాయి ని మిథున్ రెడ్డిని అవినాష్ రెడ్డిని ఢిల్లీ లోనే ఉండమని చెప్పారట.

"
"