వైసీపీ సర్కార్ షాకింగ్ డెసీషన్.. కొత్త పలుకుపై హైకోర్టుకు

‘ఏపీలో రహస్య అజెండా’ శీర్షికన ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వ్యాసంపై కోర్టుకు వెళతామని ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై పనికట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలు వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం వల్ల బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మతం మారతారని కొత్త పలుకులో రాశారు. ఇంగ్లీషు మీడియంలో చదివిన వాళ్ల పిల్లలు మతం మారారా? విదేశాల్లో ఉంటున్న ఆంధ్రులు మతం మారారా?’ అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు పెద్దఎత్తున వైసీపీకి మద్దతు పలికాయని… ఇంగ్లీషు మీడియంలో పేదపిల్లలు చుదువుకుంటే వాళ్లు తెలుగుదేశం పార్టీని పట్టించుకోరన్నది వారి ఆందోళన అని ఆరోపించారు.

అందుకే పనిగట్టుకుని ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకిస్తున్నారని మంత్రి సురేశ్‌ పేర్కొన్నారు. ‘రైట్‌ టు ఎడ్యుకేషన్‌’కు ఒక అడుగు ముందుకేసి… ‘రైట్‌ టు ఇంగ్లీష్‌ ఎడ్యుకేషన్‌’ దిశగా వెళుతున్నామన్నారు. ఇంగ్లీషు మీడియం అమలుకు సలహాలు, సూచనలు ఇవ్వమంటే దుమ్మెత్తిపోయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ’మా నిర్ణయాన్ని వక్రీకరించి రాయడానికి మనసెలా వచ్చిందో అర్ధం కాలేదు. దీనికి మతపరమైన కోణంతో ముడిపెట్టడం దారుణం’’ అని మంత్రి చెప్పారు.సమాధానాల దాటవేత‘కొత్త పలుకు’ ఒక వ్యాసమని, అది అభిప్రాయం మాత్రమే అని ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి మంత్రి సురేశ్‌ దృష్టికి తీసుకొచ్చారు. ‘ఇంగ్లీషు మాట్లాడితే క్రిస్టియన్‌’ అని కొత్త పలుకులో ఎక్కడా లేదని చెప్పగా… ‘‘ఏదైనా రాస్తే లాజికల్‌గా ఉండాలి. దీనిపై శాస్త్రీయంగా చర్చ పెట్టండి’’ మంత్రి సూచించారు. టీడీపీ హయాంలో మున్సిపల్‌ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టినప్పుడు ఎందుకు వ్యతిరేకించారనే ప్రశ్నకు మంత్రి సూటిగా సమాధానం చెప్పలేదు. ‘‘ఇది మా పాలసీ. రాజన్నరాజ్యం అనే విజన్‌తో విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం.అప్పుడు ఇంగ్లీషు మీడియాన్ని ఎందుకు వ్యతిరేకించామో డిస్కషన్‌ పెడదాం’’ అని తెలిపారు. ‘మీరు అప్పట్లో ఇంగ్లీషు మీడియాన్నే వ్యతిరేకించారు!’ అని గుర్తు చేయగా… ‘‘కేవలం మునిసిపల్‌ పాఠశాలల్లోనే ఇంగ్లీషు ప్రవేశపెట్టి, గ్రామీణ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారు’ అని జవాబు చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంగ్లీషు మీడియం పెట్టాలని అప్పట్లో అడగలేదు కదా అని ప్రశ్నించగా, ‘‘ఎందుకు పెట్టలేదో వాళ్లను అడగండి. చేయలేదంటే చేయలేదంటారు. చేశారంటే చేశారంటారు. మంచిని మంచిగానే చూద్దాం! రహస్య అజెండా అంటూ వక్రీకరణలు ఎందుకు? జగన్‌ హృదయంలోని మానవతాకోణం మీకు ఎందు కు కనిపించడం లేదు? మేము ఇంగ్లీషు మీడియం స్కూళ్లను ముందుకు తీసుకెళ్తాం’’ అని మంత్రి సురేశ్‌ స్పష్టం చేశారు.

"
"