జగన్ రహస్య మార్గం…అమరావతికి రావడానికి ఇన్ని తిప్పలా..?

రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో వున్న వైఎస్ జగన్ ఇప్పుడు రాజధాని రావడానికి రహస్య మార్గం ఏంచుకున్నాడా అంటె అవుననే అంటున్నారు.సీఎం జగన్‌కు రాజధాని రైతులు సెగ తాకుతోంది. ఆయన అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రత్యేకంగా ఓ మార్గాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. మార్గాన్ని ఏర్పాటు చేసినప్పటికీ సీఎం అసెంబ్లీకి ఎలా వస్తారనే దానిపై సందిగ్ధం నెలకొంది. సీఎం ఎలా వెళ్లాలనే దానిపై సీఎంఓకు ఇప్పటికే పోలీసుశాఖ నుంచి నివేదికలు అందాయి. జగన్ అసెంబ్లీకి ఎలా వెళ్తారనే దానిపై పోలీసులు రహస్య ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.

 

సీఎం ఏ మార్గంలో అసెంబ్లీకి వెళ్తారన్న విషయంలో పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. ముఖ్యమంత్రి అసెంబ్లీకి రావడానికి మరో మార్గాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ సీఎం కాన్వాయ్‌ వెలగపూడిలోని సచివాలయం, అసెంబ్లీకి మందడం మీదుగా వెళ్లేది. ప్రస్తుతం రైతుల ఆందోళనల నేపథ్యంలో అధికారులు ఈ మార్గాన్ని మార్పు చేశారు. గత ప్రభుత్వంలో వెంకటపాలెం, కృష్ణాయపా లెం మధ్యలో రైతులు ల్యాండ్‌ పూలింగ్‌కి ఇచ్చిన భూముల్లో నుంచే అసెంబ్లీకి వెళ్లేందుకు ఒక రోడ్డు వేశారు. ప్రముఖులు వచ్చేటప్పుడు మందడం, మల్కాపురం, వెంకటపాలెం, తాళ్లాయపాలెం గ్రా మాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించేవారు. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు రావడంతో ఈ రోడ్డును నిర్మించారు.

"
"