వైఎస్ జగన్ కు జలక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్…

ఎపీలో ఇప్పుడు వైఎస్ జగన్  బిత్తరపోయే షాక్ తగిలింది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పనుల్ని నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు అయ్యింది. ఒడిశా ప్రభుత్వం మొత్తం 71 పేజీల అఫిడవిట్ ను అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించింది. ఒడిశా పోలవరం ప్రాజెక్టు దగ్గర గరిష్ట వరద ప్రవాహం ఆంధ్రప్రదేశ్ చెప్పిన దాని కంటే చాలా ఎక్కువగా ఉందని పోలవరం ముంపు విషయంలో స్పష్టత లేదని అఫిడవిట్ లో పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే మాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపేస్తూ 2018 జులై 10, 2019 జూన్‌ 27 తేదీల్లో జారీచేసిన ఉత్తర్వులపై ఇచ్చిన స్టేను రద్దుచేయాలని కోరింది.

 

తమకు జరిగే నష్ట నివారణకు ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలని ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.71 పేజీల అఫిడవిట్‌ను ఆ రాష్ట్రం సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది.గోదావరి వరద ప్రవాహం ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్ కు ఇచ్చిన విధంగా కాకుండా 14 లక్షల క్యూసెక్కుల వరకు అధికంగా ఉందని పేర్కొంది. ఒడిశా ప్రభుత్వం రూర్కీ ఐఐటీ సర్వే లెక్కల ప్రకారం గోదావరిలో గరిష్టంగా 58 లక్షల క్యూసెక్కుల వరకు వరద వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. పోలవరం డ్యాం అంత వరద ప్రవాహాన్ని తట్టుకోలేదని 58 లక్షల క్యూసెక్కుల వరకు వరద వస్తే ఒడిశా రాష్ట్రంలోని సీలేరు, శబరి ప్రాంతాలలో 200 అడుగులకు పైగా ముంపు తలెత్తే అవకాశం ఉందని తేలింది. 2015 సంవత్సరంతో పోలిస్తే 2017 సంవత్సరానికి ముంపు గ్రామాల సంఖ్య తగ్గిందని ముంపు గ్రామాల విషయంలో కూడా స్పష్టత లేదని ఒడిశా ఆరోపణలు చేసింది.అంతేకాకుండా ముంపు గ్రామాల విషయంలో కూడా కేంద్రం చెప్పిన గ్రామాల లెక్క తప్పని పేర్కొంది. 2005లో బాధిత గ్రామాలు 412గా పేర్కొన్నారు.

 

2006లో అందులోంచి 136 తొలగించారు. 2017 మే నాటికి ముంపు గ్రామాల సంఖ్య 371కి చేరింది. మొత్తం ముంపు గ్రామాల సంఖ్యపై స్పష్టత లేదు. మార్చిన డిజైన్లకు అనుగుణంగా మా భూభాగంలో ముంపు ప్రాంతం పెరిగేందుకు అనుమతిస్తూ ఒడిశా ఏ ఒప్పందంపైనా సంతకం చేయలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

"
"