అమిత్ షా దెబ్బ… జగన్ కి గట్టిగా తగిలింది…

రాజకీయాలలో  ప్రజలకు మంచి చేయాలనే ఒక్కటే అనుకుంటే ఇక్కడ బోక్కా బోర్లా పడినట్టే అవుతుంది. కోన్ని సార్లు కాస్త  కఠినంగానే వుండాలి .  లేకపోతే మోత్తానికే మోసం వచ్చే  అవకాశాలు చాలా వున్నాయి.రాజకీయాల్లో ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేయాల్సి ఉంటుంది. ప్రత్యర్థి పార్టీల నేతలతో పాటు ఒక్కోసారి సొంత పార్టీ నేతలకు కూడా చెక్ చెప్పాల్సి వస్తుంది. ప్రస్తుతం ఏపీలోని అధికార వైసీపీ కూడా ఇదే రకంగా సొంత పార్టీకి చెందిన నేతకు చెక్ చెప్పిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. నరసాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు వైసీపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అదే జరిగితే… జగన్ గోకరాజును ఆహ్వానించడానికి అసలు కారణం సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వైఖరే అని చెప్పాల్సి ఉంటుంది.

కొంతకాలంగా తన వ్యాఖ్యలు, వ్యవహారశైలితో వైసీపీని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇబ్బందిపెడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.రఘురామకృష్ణంరాజు అనేక విషయాల్లో జగన్ చెప్పినా వినడం లేదని… బీజేపీకి దగ్గరవుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో ఎంపీ రఘురామకృష్ణంరాజుకు జగన్ క్లాస్ తీసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయినా ఆయన తీరులో మార్పు రాకపోవడంతో…నరసాపురంలో మరో నేతను ముందు జాగ్రత్తగా వైసీపీలోకి తీసుకురావాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గోకరాజు గంగరాజును వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు వేగవంతమయ్యాయని సమాచారం. ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం వల్ల అటు బీజేపీకి, ఇటు రఘురామకృష్ణంరాజుకు చెక్ చెప్పొచ్చనే భావనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.

"
"