అసెంబ్లీ లోనే జగన్ ని అడ్డంగా ఇరికించిన అచ్చెంనాయుడు…

ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశాలలో  టీడీపీ నుండి మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యె  అచ్చెంనాయుడు    వైసీపీ ఇచ్చిన హామీలను గుర్తూ చేశాడు.   వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో వున్నప్పుడు పలు రకాల వాగ్థానాలు ఇచ్చిన విషయం తెల్సిందే. విటీపై టీడీపీ ఎమ్మెల్యె అచ్చెంనాయుడు మరోకసారి వైసీపీ కి గూర్తూ చేశాడు.23 ఎంపీ సీట్లు గెలిపిస్తే ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ చెప్పారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ తన మాట నిలబెట్టుకోవాలన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై చర్చ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మంత్రి కన్నబాబు ఆరోపణలను తప్పుబట్టారు.

హైకోర్టులో కొట్టివేసిన కేసులను అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి సెక్రటేరియట్ భవనాలను ఉదారంగా ఇచ్చారని తెలిపారు. భవనాలు అప్పగించడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం లాభం అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ఇంకా బకాయిలు వసూలు చేయలేదన్నారు.తెలంగాణ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న 69 అంశాల్లో ఏవేవో తెలపాలన్నారు. లక్షా 97 వేల కోట్లు విలువైన ఆస్తులు షెడ్యూల్ లో ఉన్నాయని తెలిపారు. దీన్ని షీలాబేడీ కమిటీ చెప్పిందని గుర్తు చేసిందన్నారు.

"
"