వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. 500 కోట్లతో భారీ ప్లానింగ్

ఇప్పుడు వైఎస్ జగన్ విదేశీ సంస్థలు అన్నింటిని ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని కోరాడు. అలాగే మికు కావాలసిన ఎలాంటి సదుపాయాలను అయినా మెం ఏర్పాటు చేస్తాం అని చెప్పారు.ప్రపంచ పర్యాటక పటంలో ఆంధ్రప్రదేశ్‌ నం.1గా నిలిచేలా శీఘ్రగతిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ‘‘అరకు, కాకినాడ, పిచ్చుకల లంక, భారువ, గండికోట, మధురవాడ, తిరుపతి తదితర 15 నుంచి 20 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేయండి. అంతర్జాతీయంగా పేరున్న సంస్థల సహకారంతో వాటిని అభివృద్ధి చేయండి. ఈ ప్రాంతాల్లో సెవెన్‌స్టార్‌ తరహా సదుపాయాలున్న హోటళ్లు తీసుకురండి. అంతర్జాతీయ స్థాయిలో అక్కడ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయండి’’ అని నిర్దేశించారు. టూరిజం, ఆర్కియాలజీ, యువజన సంక్షేమ శాఖలపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. దేశంలో అడుగుపెట్టే ప్రతి పర్యాటకుడు రాజస్థాన్‌ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంటున్నారు.

అక్కడి పర్యాటక ప్రాంతాల్లో అంతర్జాతీయ సదుపాయాలు ఉండడమే దానికి కారణమని జగన్‌ అన్నారు. ఇంకా సమావేశంలో ఏయే అంశాలపై చర్చించారనేది మీడియాకు పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్‌ వివరించారు. ‘‘రాజస్థాన్‌ తరహాలో రాష్ట్రంలో అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాలను ముందుగా ఎంపిక చేసి నాకు వివరాలు అందించండి.ఆతిథ్యరంగంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలున్న సంస్థలను ఎంపిక చేసి హోటళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహించాలి. వారికి రాష్ట్రంలో ఉత్తమ సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. దీని వల్ల రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలపై సహజంగానే అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రచారం లభిస్తుంది. అభివృద్ధి చేయాల్సిన పర్యాటక ప్రాంతాలను గుర్తించిన తర్వాత వాటి మార్కెటింగ్‌పైనా దృష్టి పెట్టాలి’’ అని సీఎం అధికారులను ఆదేశించారు. కళింగపట్నం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, పోలవరం, సూర్యలంక, హార్సిలీహిల్స్‌, ఓర్వకల్లు, గండికోట తదితర పర్యాటక ప్రాంతాల విషయం అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వాటిపై పూర్తిస్థాయి వివరాలతో సమాచారం అందించాలని వారిని ఆయన కోరారు.గండికోటలో అడ్వెంచర్‌ అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, అక్కడ నదికి అడ్డంగా గ్లాస్‌తో ఒక వంతెన కూడా నిర్మించే ఆలోచన చేస్తున్నామని, పలు పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వేలను నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అధికారులు వివరించారు. తనకు సమర్పించే నివేదికలో ఈ ప్రతిపాదనలన్నీ చేర్చాలని సీఎం సూచించారు. పోలవరం, పులిచింతల, నాగార్జున సాగర్‌, శ్రీశైలం, సోమశిల, కండలేరు తదితర రిజర్వాయర్లు, డ్యామ్‌లతోపాటు విశాఖజిల్లాలో అరకు, లంబసింగి, పాడేరు, మారేడుమిల్లి ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు.గోదావరిలో తిరిగి బోట్లను తిప్పడంపై సమావేశంలో చర్చకు వచ్చింది. నదీ తీరాల్లో కంట్రోల్‌ రూముల ఏర్పాటుపై సీఎం ఆరా తీశారు. ‘‘పర్యాటకులు, ప్రయాణికుల కోసం సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నట్టు సంతృప్తి చెందిన తర్వాతే అనుమతి ఇవ్వాలి. కమిటీ నివేదిక రాగానే సిఫారులపై చర్చిద్దాం’’ అని వివరించారు.

శిల్పారామాల నిర్వహణకు ఓ విధానాన్ని తయారు చేయాలని కోరారు. ప్రతి జిల్లాలో కల్చరల్‌ అకాడమీ ఏర్పాటుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. ‘‘కనీసం ఐదెకరాల స్థలంలో ఈ అకాడమీలను నిర్మించాలని, రెండేళ్లల్లో వాటిని పూర్తి చేయండి. సంగీతం, నాట్యం సహా ఇతర కళల్లో శిక్షణ, బోధన, ప్రదర్శనలకు కల్చరల్‌ అకాడమీలు వేదిక కావాలి. మన కళలను, సంస్కృతిని నిలుపుకోవడానికి, వాటి ప్రాముఖ్యత పెంచడానికి అకాడమీలు ఉపయోగపడతాయి’’ అని అభిప్రాయపడ్డారు. సంగీత, నృత్య కళాశాలల్లో బోధిస్తున్న తాత్కాలిక, శాశ్వత సిబ్బంది జీతాలు పెంచాలని ఆదేశించారు.

"
"