‘ ఏలూరి ‘ పార్టీ మార్పుపై జోరు ప్ర‌చారం.. అస‌లు స్టోరీ ఏంటంటే

రాజ‌కీయాల్లో అనేక ఎత్తుగ‌డలు ఉంటాయి. బ‌ల‌మైన‌ ప్ర‌త్య‌ర్థుల‌ను త‌మ‌వైపున‌కు తిప్పుకొనేందుకు అధి కారంలో ఉండే పార్టీ వేసే ఎత్తులు అన్నీ ఇన్నీ కావు. సామ‌, దాన, భేద‌, దండోపాయాల‌ను వినియోగించ డం కామ‌నే. అయితే, వీటికి లొంగే నాయ‌కులు చాలా మందే ఉన్నారు. ఉంటారు కూడా. కానీ, ఒక‌రిద్ద‌రు మాత్రం వీటికి కూడా లొంగుతార‌నే గ్యారెంటీ లేదు. దీనికి వారికి ఉన్న ప్రజాబ‌లం, నైతిక విలువలు.. క‌ట్టు బాటు అనే విధానాలు కావొచ్చు. మ‌రి ఇలాంటి వారిని ఏం చేయాలి? ఏ విధంగా లొంగ దీసుకోవాలి? ఒక వేళ లొంగ‌క‌పోతే.. ఏం చేయాలి? ఈ నేప‌థ్యంలోనే అధికారంలో ఉన్న వైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రి స్తోంది.

త‌న దారికి రాని టీడీపీ నాయ‌కుల‌ను బ‌ద్నాం చేసే కార్య‌క్ర‌మానికి సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌కాశం జి ల్లా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావుపై వైసీపీ నాయ‌కులు వ్యూహాత్మ‌కంగా విష ప్ర‌చారానికి తెర‌దీశారు. ఆయ‌న పార్టీ మారేందుకు రెడీ అయ్యార‌ని, టీడీపీలో ఆయ‌న అసంతృప్తితో ర‌గి లిపోతున్నార‌ని, అధినేత చంద్ర‌బాబు ఆయ‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, …. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న అభివృద్ధి కాంక్షించి జ‌గ‌న్‌కు జై ప‌లుకుతున్నార‌ని ఇలా అనేక రూపాల్లో వైసీపీ నాయ‌కులు విష ప్ర‌చారానికి పురిగొల్పుతున్నారు.నిజానికి ఏలూరి వంటి నాయ‌కుడికి పార్టీలు మారాల్సిన అవ‌స‌రం ఏముంటుంది. ఆయ‌న‌కు ప‌ద‌వుల‌పై వ్యామోహం లేదు. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే దీక్ష త‌ప్ప‌. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండాల‌నే ఆకాంక్ష త‌ప్ప‌. వాస్త‌వానికి ఓ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడికి బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గంలో వ‌రుస‌గా విజ‌యాలు సాధించ‌డం ఏలూరి వ‌ల్లే సాధ్య‌మైంద‌నేది వాస్త‌వం. ఇంత బ‌ల‌మైన వైసీపీ, జ‌గ‌న్ వేవ్‌లో కూడా ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు లాంటి రాజ‌కీయ ధురంధ‌రుడిని ఏలూరి ఓడించాడంటే అత‌డి స‌త్తా ఏంటో వైసీపీ వాళ్ల‌కు కూడా క్లీయ‌ర్‌గా అర్థ‌మైంది.అది కూడా జ‌గ‌న్ సునామీని త‌ట్టుకుని ఈ ఏడాది ఎన్నిక‌ల్లో రెండో సారి విజ‌యం సాధించ‌డం వెనుక ఆయ‌న చేసిన అభివృద్ధి, ప్ర‌జ‌ల‌కు చేరువగా ఉండ‌డం, వారి క‌ష్ట సుఖాలు పంచుకోవ‌డం, పార్టీని, ప్ర‌జ‌ల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ.. అన్నీతానై ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రిగేలా వ్య‌వ‌హ‌రించ‌డం వంటివి ఏలూరికి పెట్ట‌ని కోట‌లు గా ఉన్నారు.అలాంటి నాయ‌కుడు ఇప్పుడు ఏం జ‌రిగింద‌ని వైసీపీకి మ‌ద్ద‌తిస్తారు? అభివృద్ధి కోసం పార్టీలు మార‌డం అనేది ట్రాష్‌. ఎమ్మెల్యేగా ఉన్న నాయ‌కుడు ఏ పార్టీలో ఉన్నా.. నిధులు వ‌స్తాయి.

ఒక‌వేళ ప్ర‌తిప‌క్షంలో ఉన్నారు కాబ‌ట్టి త‌గ్గినా.. ఆది నుంచి స్వ‌చ్ఛంద సేవ చేయ‌డం అల‌వాటుగా మారిన ఏలూరికి ఇప్పుడు జ‌గ‌న్‌కు జై కొట్టాల్సిన అవ‌స‌రం లేదు. ఎన్నిక‌ల్లో పార్టీల‌కు గెలుపు ఓట‌ములు స‌హజం. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఓడినంత మాత్రాన పార్టీ అధికారంలోకి రాద‌నే గ్యారెంటీ లేదు. ప‌ట్టుద‌ల కృషిని న‌మ్ముకున్న ఏలూరి వంటివారికి అదే దిక్సూచి అయిన‌ప్పుడు వైసీపీ చేసే ఇలాంటి దారుణ ప్ర‌చారం ప్ర‌చారంగానే మిగిలి పోతుంద‌న‌డంలో సందేహం లేదు.

"
"