విజయసాయిరెడ్డి ఏక్కడ కనబడితే అక్కడ..?

విజ‌య‌సాయిరెడ్డి ఢిల్లీలో అమిత్ షాకి కన‌ప‌డితే దేహ‌శుద్ది చేయ‌డం ఖాయ‌మ‌ని ఢిల్లీ టాక్‌. అందుకే నిన్న బ‌డ్జెట్ పై ప్ర‌సంగించాల్సి వున్నా, త‌ప్పించుకు తిరిగార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. విజ‌య‌సాయిరెడ్డి కేంద్ర పెద్ద‌ల‌కు యిచ్చిన స‌మాచారంతో చంద్ర‌బాబు ల‌క్ష్యంగా చేసిన దాడుల్లో పూచిక పుల్ల కూడా దొర‌క‌లేదు. దీంతో త‌మ‌ను ఇటువైపుగా డైవ‌ర్ట్ చేసిన విజ‌య‌సాయిరెడ్డి క‌న‌ప‌డితే కొట్టేంత కోపంలో అమిత్ షాతోపాటు మోడీ వున్నారు.మొన్న ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కి ఆర్థిక సాయం అందించింది చంద్ర‌బాబేన‌ని ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ వారి స‌న్నిహితుల ఇళ్ల‌పై దాడులు చేస్తే ఈ నెట్ వ‌ర్క్‌ని ఎస్టాబ్లిష్ చేయొచ్చ‌ని అమిత్ షా వ‌ద్ద ప్ర‌తిపాద‌న‌లు వుంచింది విజ‌య‌సాయిరెడ్డే.

 

 

అయితే ఏ2 మాట‌లు న‌మ్మి తమ అధికార‌మంతా ఉప‌యోగించుకుని ఐటీ, జీఎస్టీ, ఈడీ మూడు శాఖ‌ల అధికారుల‌ను రంగంలోకి దింపారు అమిత్ షా. ఐదు రోజులుగా చంద్ర‌బాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌తోపాటు కొందరు టీడీపీ నేత‌లు, చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేశ్‌కి స‌న్నిహితుల ఇళ్లలో చాలా ప‌కడ్బందీగా దాడులు చేయించారు. దాదాపు అన్నిచోట్లా కూడా కొండ‌ల్ని త‌వ్విన ఈ అధికారుల‌కు ఎలుక కాదు క‌దా! ఎలుక తోక కూడా దొర‌క‌లేదు. దీంతో అమిత్‌షా విజ‌య‌సాయిరెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హంగా వున్నారు. అలాగే అమిత్ షాకి అత్యంత స‌న్నిహితుడైన ఒక 5 స్టార్ హోట‌ల్ య‌జ‌మానికి చెందిన అత్యంత విలువైన హైద‌రాబాద్‌లో ఆస్తిని విజ‌య‌సాయిరెడ్డి క‌బ్జా చేశారు. ఈ విష‌యంపై రెడ్డిగారిని పిలిచి ఇదివ‌ర‌కే ఒక రౌండ్ పీకారు అమిత్‌షా. లెంప‌లేసుకున్న వీసారెడ్డి మ‌ళ్లీ ఇటువంటి త‌ప్పు ఎప్పుడూ చేయ‌న‌ని మాటిచ్చారు. ఆ త‌రువాత ఇదిగో ఇలా త‌ప్పుడు స‌మాచారంతో ఇచ్చి ఆల్రెడీ ర‌గిలిపోతున్న అమిత్‌షాకి మ‌ళ్లీ కోపం తెప్పించారు. ఢిల్లీలో బీజేపీ ఓట‌మితోపాటు ఏపీలో చంద్ర‌బాబు టార్గెట్‌గా చేసిన ఐటీ దాడుల్లో ఏమీ దొర‌క్క అమిత్ షా మాంచి కాక మీదున్నారు. చంద్ర‌బాబుపై త‌మ వ్య‌క్తిగ‌త క‌క్ష‌, తెలుగుదేశం పార్టీని దెబ్బ‌కొట్టాల‌నే వ్యూహంతో బీజేపీ పెద్ద‌ల‌కు త‌ప్పుడు స‌మాచారం ఇచ్చిన ఐటీ దాడులు చేయించిన విజ‌య‌సాయిరెడ్డి ఢిల్లీలో వున్నా అమిత్‌షా, మోడీల‌కు ఎదురుప‌డ‌కుండా తిరుగుతున్నారు.

"
"