జగన్ పై ,టీడీపీ నెత సంచలనం

రాష్ట్రంలో  రాజధాని ఆంశంలో  ఏలాంటి  పరీస్థీతులు ఏదుర్కుంటుదో మనందరికి తేలిసిన విషయమే.  దినిపై రాష్ట్రంలోని మిగతా పార్టీలన్ని అమరావతి కోసం చేసే పోరాటానికి మద్దత్తు తేలిపాడు. ఇక టీడీపీ  నాయకులు అక్కడే  ప్రజలకు అండగా వుంటు వారిలో ధైర్యం కోల్పోకుండా నిరసనలు చేసే విధంగా చేస్తున్నారు.మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా.. రాజధాని రగడపై స్పందించారు. ఏపీ సీఎం జగన్‌పై ఫైర్ అయ్యారు. ఏ జిల్లాలో సీఎంగా ప్రమాణం చేశారో ఆ జిల్లాకే జగన్ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. మనసున్న మారాజని 151 సీట్లు ఇచ్చారని.. కానీ ఆయన మాత్రం ప్రజల గోడు పట్టించుకోవడం లేదని సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ.. మూడు రాజధానులు కాకపోతే 30 అనుకోనివ్వండి.. మిగిలిన అందరికి తెలిసి ఒకటే రాష్ట్రం, ఒకటే రాజధాని అని రాధా తేల్చి చెప్పారు. రైతులకు మద్దతుగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.

 

మంగళవారం(జనవరి 14,2020) అమరావతి ప్రాంతంలో రాధా పర్యటించారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని మందడంలో దీక్ష చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడిన రాధా.. ముఖ్యమంత్రి జగన్‌పై మండిపడ్డారు. రాజధాని విషయంలో పాలకుల బుద్ధి మారాలన్నారు. రాజన్న రాజ్యం అంటే ఇదేనా? అని నిలదీశారు. 3 రాజధానుల నినాదం పక్కనపెట్టి ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదాన్ని సీఎం జగన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతులు రాష్ట్రం కోసం 33వేల ఎకరాలు త్యాగం చేశారని.. అలాంటి వాళ్లు పండుగ రోజు ఇలా పోరాటం చేయడం బాధగా ఉందన్నారు. ఇంతమంది రోడ్డున పడినా.. కనీసం పలకరించే సమయం కూడా లేదా అంటూ జగన్ ను ప్రశ్నించారు. రైతులను కొందరు పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారని.. ఎవరైనా ఒక ప్రజా ప్రతినిధిని ఇక్కడికి పంపిస్తే.. ఎవరు పెయిడ్ ఆర్టిస్టులో తెలిసిపోతుందన్నారు. అమరావతి రాజధాని కోసం పార్టీలకు, కులాలు, మతాలకు అతీతంగా పోరాటం జరుగుతోందన్నారు.సీఎం జగన్ కి.. పక్క రాష్ట్రానికి వెళ్లాడానికి.. ఎడ్ల పందాలకు వెళ్లడానికి సమయం ఉందని.. కానీ.. రైతుల గోడు విడనడానికి ఓ మనిషిని పంపించడానికి కూడా మనసు రావడం లేదన్నారు వంగవీటి రాధా.

 

ఇంతమంది రోడ్డుపై ఉంటే ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. రైతుల నాయకత్వంలోనే తాము నడుస్తామన్నారు. ”జనవరి 20న అసెంబ్లీలో రాజధానిపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోందని.. ఇదే ఆఖరి పోరాటంలా.. వాళ్లు ఏం నిర్ణయం తీసుకున్నా.. మనకు ఒకటే రాష్ట్రం.. ఒకటే రాజధాని.. అది అమరావతి అనే నినాదంతో ముందుకు సాగుదాం.. రైతులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేం సిద్ధం.. ఇది మన కోసం.. మన రాష్ట్ర భవిష్యత్ కోసం జరిగే పోరాటం’ అని రాధా అన్నారు. వంగవీటి రాధా మద్దతు తెలపడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. తమ పోరాటానికి మరింత మద్దతు పెరిగిందన్నారు.

"
"