టీఆర్ఎస్ మంత్రి షాకింగ్ కామెంట్..ఏకంగా కేసీఆర్ పైనె..

తెలంగాణాలో మరోకసారి అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. తెలంగాణాలో వున్న టీఆర్ఎస్ మంత్రి మరోకసారి అధిష్టానంపై విరుచుకుపడ్డాడు.తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా స్పందించారు. ఓ రకంగా కేసీఆర్‌కు సూటిగా తగిలేలా మాట్లాడారు. తెలంగాణ ఆర్టీసీ సమ్మె సమయంలో కేసీఆర్ యూనియన్లకు వ్యతరేకంగా మాట్లాడారు. అసలు ఆర్టీసీలోనే కాదు.. ఎందులోనూ యూనియన్లు ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీలో యూనియన్ నాయకుల వల్లే మొత్తం సమస్యలు వస్తున్నాయని తేల్చి చెప్పారు.

 

అందుకు ప్రతిగా ఒక్కో డిపో నుంచి 9 మంది సభ్యులు తమ తమ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావొచ్చని చెప్పారు. ఓ వైపు సీఎం కేసీఆర్ మాత్రం యూనియన్లు అంటే అగ్గి మీద గుగ్గిలంలా మండిపడుతుంటే… మరోవైపు ఈటల రాజేందర్ మాత్రం యూనియన్లు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.సంగారెడ్డి జిల్లా కంది మండలం ఓడీఎఫ్ గేటు వద్ద సావిత్రి బాయ పూలే జయంతి కార్యక్రమానికి ఈటల హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘ఈ మధ్య కొందరు యూనియన్లు ఎందుకు అంటున్నారు?. అన్నీ ఉన్నోడికి యూనియన్లు అవసరం లేదు. అణచివేతకు గురవుతున్న మనలాంటి వారికి అవసరమే.’ అని ఈటల కామెంట్ చేశారు.గతంలో గులాబీ పార్టీ ఓనర్లం తామే అని ఓ సందర్భంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత హుజూరాబాద్ సభలో కూడా ఓ సారి పార్టీ మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను గ్రూపు రాజకీయాలు చేయలేనని, నమ్ముకున్నవాళ్లే తనను వెన్నుపోటు పొడిచారని అన్నారు.

 

ఈటల తర్వాత మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా గులాబీ పార్టీ ఓనర్లం తామే అని వ్యాఖ్యానించారు.అసలు ఈటల మనసులో ఏముందనే అంశం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఈసారి డైరెక్ట్‌గా కేసీఆర్‌ను టార్గెట్ చేయడం టీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది.

"
"