రాజధాని మార్పు అమలవుతుందా.? టీడీపీ మాస్టర్ ప్లాన్…

రాజధాని  వికెంద్రికరించడం అనే ఆంశంలో  ఏపీ అసెంబ్లీలో బిల్లు పాసయ్యింది. అలాగే వైసీపీ ఎమ్మెల్యెల అమోదంతో  బిల్లు పాసయ్యింది. కాని ఇక్కడ టీడీపీ రాజధాని వికెంద్రికరించడానికి అడ్డు పడే అవకాశం వుంది. అసలు విషయం ఏమిటంటే రాజధాని  వికేంద్రికరించకుండా అపడానికి శాసన మండలి ద్వారా ఇంకా ఆవకాశం వుందని అందరు అనుకుంటున్నారు.ఏపీ రాజధాని మార్పు బిల్లు శాసనసభలో ఆమోదం పొందింది. అయితే.. ఇప్పుడు టీడీపీ బలం ఉన్న శాసనమండలిలో నెగ్గాలి. కానీ.. అమరావతికి జై కొడుతున్న టీడీపీ.. ఆ బిల్లుకు అడ్డు పడే అవకాశం ఉంది. బిల్లు నేడు మండలికి చేరబోతోంది.

 

అక్కడ బిల్లును ఆమోదం పొందనీయకుండా టీడీపీ అన్ని రకాలుగా ప్రయత్నించే అవకాశం ఉంది. బిల్లు మండలికి చేరిన అనంతరం.. ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే ఎమ్మెల్సీలకు చంద్రబాబు నిర్దేశం చేసినట్లు సమాచారం. బిల్లు ఆమోదం పొందకుండా టీడీపీ ముందు 3 మార్గాలున్నాయి. శాసనసభలో ఆమోదం పొందిన బిల్లును తిరస్కరించి వెనక్కి పంపడం మొదటిది. ఇలా చేస్తే శాసనసభలో రెండో సారి ఆమోదించి మళ్లీ మండలికి పంపుతారు. రెండోది.. మండలికి మరోసారి వస్తే తిరస్కరించకుండా సెలెక్ట్‌ కమిటీకి పంపడం. మూడోది.. ఫస్ట్‌టైం బిల్లు వచ్చినప్పుడే సెలక్ట్‌ కమిటీకి పంపడం. బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపితే అక్కడ దాదాపు 2, 3 నెలల పాటు ఆపే అవకాశం ఉంటుంది.దీంతో.. అప్పటిదాకా బిల్లు ఆమోదం పెండింగ్‌లో పడుతుంది. ఈ మూడు మార్గాల్లో టీడీపీ ఏ మార్గాన్ని ఎంచుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

 

అయితే.. బిల్లును ఆమోదించుకోవడానికి జగన్ సర్కారు వ్యూహరచన చేస్తోంది. ఒకవేళ.. వ్యూహం ఫలించకపోతే ఆర్డినెన్స్ జారీ చేసేలా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆరు నెలల్లోగా దాన్ని ఆమోదించుకోవాల్సి ఉంటుంది. దానికి.. గవర్నర్ ఆమోదం తెలపాలి. ఆయన దాన్ని కేంద్రం పరిశీలనకు పంపింతే అక్కడ కూడా ఆలస్యం కానుంది. అదీకాక.. ఆర్డినెన్స్‌ జారీపై కోర్టులో పిటిషన్లు వేసే అవకాశం కూడా ఉంటుంది. దాంతో రాజధాని మార్పు ప్రక్రియ పెండింగ్‌లో పడే అవకాశం ఉంది.

"
"