టేలికాం రంగంలో మరోకసారి సమరశంఖం పూరించిన జియో

రిలయన్స్‌ జియో.. దేశీయ టెలికాం రంగంలో మరోసారి సమర శంఖం పూరించింది. తాజాగా పోస్ట్‌పెయిడ్‌ సెగ్మెంట్లోనూ ఆధిపత్యం కోసం చార్జీల యుద్ధానికి తెరలేపింది. ‘జియో పోస్ట్‌పెయిడ్‌ ప్లస్‌’ పేరుతో సరికొత్త ప్లాన్లను ఆవిష్కరించింది. ప్లాన్‌ను బట్టి రూ.399 నుంచి రూ.1,499 వరకు నెలవారీ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.ప్రముఖ ఓటీటీల వీడియో స్ట్రీమింగ్‌ వినోదం, ఉచిత అంతర్జాతీయ రోమింగ్‌, తొలిసారిగా ఇన్‌ ఫ్లైట్‌ కనెక్టివిటీ, డేటా రోల్‌ఓవర్‌, వైఫై కాలింగ్‌ తదితర ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ ప్లాన్లను డిజైన్‌ చేసింది. ఈనెల 24 నుంచి జియో స్టోర్లలో కొత్త ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇతర నెట్‌వర్క్‌లకు చెందిన కస్టమర్లు ప్రస్తుత నెంబరుతోనే ఎలాంటి డౌన్‌టైమ్‌ లేకుండా జియోకు మారవచ్చు. ఉచిత హోమ్‌ డెలివరీ అండ్‌ యాక్టివేషన్‌ సౌలభ్యం కూడా కల్పిస్తున్నట్లు రిలయన్స్‌ జియో వెల్లడించింది.
పోస్ట్‌పెయిడ్‌ ప్లస్‌ ఫీచర్లువినోద సేవలు : నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్ర్కిప్షన్‌, 650కి పైగా లైవ్‌ చానెళ్లు, వీడియో కంటెంట్‌.

అంతర్జాతీయ సేవలు : విదేశాలకు ప్రయాణించే వారికి ఇన్‌ ఫ్లైట్‌ కనెక్టివిటీ, అమెరికా, యూఏఈలో ఉచిత అంతర్జాతీయ రోమింగ్‌, ఇంటర్నేషనల్‌ రోమింగ్‌లో రూపాయికే ఇండియాకు వైఫై కాలింగ్‌, ఐఎస్‌డీ కాలింగ్‌ సదుపాయం నిమిషానికి 50 పైసల నుంచి ప్రారంభం..

విశేష సేవలు : పూర్తి కుటుంబం కోసం ఫ్యామిలీ ప్లాన్‌, ఒక్కో కనెక్షన్‌కు రూ.250, భారత్‌తోపాటు విదేశాల్లోనూ వైఫై కాలింగ్‌, 500 జీబీ వరకు డేటా రోల్‌ఓవర్‌ వసతి.
టారిఫ్‌ ప్లాన్లురూ.399

75 జీబీ డేటా

200 జీబీ డేటా రోల్‌ఓవర్‌రూ.599

100జీబీ డేటా

200 జీబీ డేటా రోల్‌ఓవర్‌

ఫ్యామిలీ ప్లాన్‌తో కూడిన అదనపు సిమ్‌ కార్డురూ.799

150జీబీ డేటా

200 జీబీ డేటా రోల్‌ఓవర్‌

ఫ్యామిలీ ప్లాన్‌తో కూడిన 2 అదనపు సిమ్‌ కార్డ్స్‌రూ.999

200 జీబీ డేటా

500 జీబీ డేటా రోల్‌ఓవర్‌

ఫ్యామిలీ ప్లాన్‌తో కూడిన 3 అదనపు సిమ్‌ కార్డ్స్‌


రూ.1,499

300 జీబీ డేటా

500 జీబీ డేటా రోల్‌ఓవర్‌

అమెరికా, యూఏఈలో అపరిమిత డేటా, వాయిస్‌

"
"