తెలంగాణాలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేస్ లు

కరోనా మహమ్మారి నుంచి తెలంగాణకు బుధవారం కాస్త ఊరట లభించింది. గత మూడు రోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే.. ఈ సంఖ్య బుధవారం అనూహ్యంగా తగ్గడం కాస్త ఊరట కలిగించే విషయం. బుధవారం కొత్తగా తెలంగాణలో 15 కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కేసులు సంఖ్య 943కి చేరింది. కరోనాతో బుధవారం ఒకరు మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 24కి చేరింది.

 

జీహెచ్‌ఎంసీ పరిధిలో 10, సూర్యాపేటలో 3, గద్వాలలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 725గా ప్రకటించింది. ఇప్పటివరకూ 194 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయనట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత బుధవారం కేవలం ఆరు కేసులే నమోదయ్యాయి. ఈ బుధవారం 15 కేసులు నమోదు కావడం గమనార్హం. వారం వ్యవధిలో నమోదైన కేసులను పరిశీలిస్తే మళ్లీ ఈ బుధవారమే ఇంత కనిష్టంగా కేసులు నమోదయ్యాయి.

"
"