తెలంగాణా ప్రభుత్వం షాకింగ్ డేసిషన్..

కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలో ఫీవర్ సర్వైలెన్స్‌లోనికి మెడికల్ షాపులు రానున్నాయి. మెడికల్ షాపులు ఫీవర్ సర్వైలైన్స్‌లోకి భాగస్వామ్యం చేస్తూ శనివారం మధ్యాహ్నం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జ్వరం, గొంతునొప్పి టాబెట్లు కొనుగోలు చేసే వారి వివరాలను సేకరించాలని మెడికల్‌ షాపులకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.

 

అయితే.. వారి వివరాలను సేకరించి ప్రభుత్వం ఏం చేయబోతోంది..? వారికి టెస్ట్‌లు చేసి క్వారంటైన్‌కు తరలిస్తుందా..? ఇంకేమైనా చేస్తుందా..? అనేదానిపై తెలంగాణ ప్రజానీకంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తానికి చూస్తే.. మెడికల్ షాపుల్లో టాబ్లెట్స్ కొనేవారికి ఇది ఒకింత షాకింగ్ విషయమేనని చెప్పుకోవచ్చు. కాగా.. జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి కరోనా లక్షణాలన్న విషయం తెలిసిందే.

"
"