టీడీపీ నెతలు టార్గేట్….అంతా కక్ష్యసాధింపేనా

ఎపీలో ఇప్పుడు అంతా క్షక్ష్యసాధింపులు   జరుగుతున్నాయని టీడీపీ నెతలు మండి పడుతున్నాయి.టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో పాటు మరికొందరు టీడీపీ నేతలకు కూడా జగన్ సర్కారు భద్రత తొలగించింది. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, యరపతినేని తదితరులకు భద్రత తొలగించారు. రాజకీయ కక్షసాధింపుతోనే తమకు భద్రత తొలగించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. భద్రత తొలగింపునకు సంబంధించి తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని మండిపడుతున్నారు. అయితే స్టేట్ సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఆదేశాల మేరకే భద్రతను తొలగించినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రభుత్వ తీరుపై న్యాయపోరాటం చేయనున్నట్లు తెలిపారు.

 

రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తనతో పాటు పలువురు టీడీపీ నేతలకు ముప్పు ఉందని మాజీ మంత్రి ప్రత్తిపాటి చెప్పారు. తమకు భద్రతను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమకు భద్రతను కొనసాగించని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అవసరమైన ప్రతిపక్ష నేతలకు భద్రతను కొనసాగించినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం ప్రతిపక్ష నేతలకు భద్రత తొలగిస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు.టీడీపీ తరఫున క్రియాశీలకంగా పనిచేస్తున్న నేతల కదలికలను నియంత్రించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం పలువురు టీడీపీ నేతలకు భద్రత తొలగించినట్లు తెలుస్తోందని ఆ పార్టీ నేత కాల్వ ఆరోపించారు.

"
"