టీడీపీ కి షాక్, వైసీపీలోకి మరో నెత

ఏపీలో టీడీపీ సార్వత్రిక ఏన్నికలలో ఓటమి చెందినప్పటి నుండి ఏవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు.టీడీపీ నుంచి మరో నాయకుడు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కడప జిల్లా కమలాపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి త్వరలోనే వైసీపీ గూటికి చేరబోతున్నారు. ఇప్పటికే ఆయన టీడీపీకి దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో కమలాపురం నుంచి టీడీపీ టికెట్ ఆశించారు వీరశివారెడ్డి.

 

అయితే మరొకరికి టికెట్ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు… ఆయనకు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మరో పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో… వీరశివారెడ్డి ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా కమలాపురం మండలం కోగటం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయ ఏర్పాటుకు, నూతన భవన నిర్మాణాల కోసం భూమి పూజ కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, డిసీసీబీ చైర్మన్‌ అనిల్‌ కుమార్‌ రెడ్డి ఘనస్వాగతం పలికారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి త్వరలో సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్టు రవీంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు.

"
"