ప్రైవేట్ అసుపత్రులలో జరుగుతున్న మోసాలు

పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తికి కొవిడ్‌ సోకింది. అతను చిన్న రైతు. ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే.. బెడ్‌లు లేవు అని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రిలో చేరదామని వెళ్లగా, అడ్మిట్‌ చేసుకోవాలంటే అప్పటికప్పుడు ఐదు లక్షలు కట్టాలని వైద్యులు తేల్చేశారు. ‘అంత డబ్బా!’ అని షాక్‌కు గురవుతుండగానే మరో పిడుగు నెత్తిన వేశారు. మొత్తం చికిత్స పూర్తయ్యేసరికి మరో రూ.తొమ్మిది లక్షలు అవుతుందని తేల్చేశారు. అంటే మొత్తం రూ.14లక్షలు అవుతుంది అని చావుకబురు చల్లగా చెప్పారన్నమాట. […]

హైద్రాబాద్ లో చూసిన డబ్బులు ఎమయ్యాయో..?

హైదరాబాద్‌లో వెలుగుచూసిన రూ.1000 కోట్ల చైనా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ల వ్యవహారం ద్వారా ప్రధానంగా ఎవరెవరు లబ్ధి పొందారనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రకటించింది. పేటీఎం, హెచ్‌ఎ్‌సబీసీ బ్యాంకు ఖాతాల ద్వారా అక్రమంగా ఎవరెవరికి నిధులు మళ్లాయి అనేది తెలుసుకోవడంపై దృష్టి సారించినట్లు తెలిపింది. చైనా జాతీయులు స్థాపించిన డాకీ పే టెక్నాలజీ, లిన్‌క్యున్‌ టెక్నాలజీ కంపెనీల ద్వారా ఈ స్కామ్‌ జరిగిందని వెల్లడించింది. ఈ-కామర్స్‌ ముసుగులో వందలాది వెబ్‌సైట్లను సృష్టించి, వాటి […]

హైద్రాబాద్ లో ఇది పరీస్థీతి…

లంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆరేళ్లలో హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.32533 కోట్లు ఖర్చు చేశామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఇటీవలే అసెంబ్లీలో ప్రకటన చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారిక లెక్కల ప్రకారం రహదారుల నిర్మాణం, నిర్వహణ(వంతెనలు, అండర్‌పా్‌సలు కాకుండా)కు ఆరేళ్లలో చేసిన ఖర్చు రూ.3023 కోట్లు. కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నా మహానగరంలోని రహదారుల పరిస్థితి మెరుగవడంలేదు. లాక్‌డౌన్‌ సమయంలో అద్దంలా మెరిసిన రోడ్లు ఇటీవల కురిసిన వర్షాల దెబ్బకు వెలవెలబోతున్నాయి. అడుగడుగునా గుంతలు, తేలిన కంకరతో వాహనాదారులకు […]

సొంత కార్యకర్తపై చెయిజారిన టీఆర్ఎస్ …

ఆందోల్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ సొంత పార్టీ కార్యకర్తపై చేయిచేసుకున్నారు. దీంతో గ్రామస్థులంతా ఏకమై ఆయనను నిలదీశారు. చేసేదేమీ లేక వారికి క్షమాపణ చెప్పిన ఆయన.. ఆ వెంటనే తిరుగు పయనమయ్యారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని తొగుట మండలం వెంకట్రావుపేటలో ఆదివారం జరిగింది. గ్రామంలో కార్యకర్తలను కలిసేందుకు క్రాంతికిరణ్‌ వెళ్లారు. ఆయనతో పాటు పార్టీ మండల అధ్యక్షుడు సిలివేరి మల్లారెడ్డి ఉన్నారు. సమావేశం జరుగుతుండగా అక్కడ కనకరాజు అనే కార్యకర్త […]

టార్గేట్ ను సిధ్ధం చేసిన సుప్రీంకోర్ట్…

నేరచరిత్ర కలిగిన ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్‌ కేసులను సత్వరమే విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీటిని హేతుబద్ధంగా ఏర్పాటు చేసేందుకు వారం రోజుల్లోగా యాక్షన్‌ ప్లాన్‌ తయారుచేసి సమర్పించాలని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హృషీకేశ్‌ రాయ్‌లతో కూడిన ధర్మాసనం అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. కార్యాచరణ ప్రణాళిక రూపొందించేటప్పుడు ఇప్పటికే వేగంగా విచారణ జరుగుతున్న కేసులను మరో […]

అమరావతి విషయంలో అలా చేయాలన్నా కుదరదు…

అమరావతిని అటకెక్కించేందుకు, విపక్ష నేతలపై గురి పెట్టేందుకు ఎంచుకున్న ఒక అస్త్రం… ‘రాజధాని భూముల్లో కుంభకోణం… ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’! అయితే… 2012, 2013తో పోల్చితే 2014లో అమరావతి ప్రాంతంలో అసాధారణమైన, అసహజ రీతిలో భూ లావాదేవీలు ఏవీ జరగలేదని రిజిస్టర్‌ అయిన డాక్యుమెంట్ల సంఖ్యను కూడా వివరిస్తూ గురువారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. ఆ విషయాన్ని పక్కనపెడితే… రాష్ట్ర విభజనంటూ జరిగితే, గుంటూరు-విజయవాడ మధ్యే రాజధాని వస్తుందనేది ప్రజల్లో ఉన్న విస్తృతమైన అభిప్రాయం. తెలంగాణ ఉద్యమం […]

మరోసారి ప్రభుత్వ నిర్ణయానికి అడ్డుపడిన హైకోర్ట్…

జగన్‌ ప్రభుత్వానికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ప్రభుత్వ పాలకులను ఇరుకునపెట్టడమే లక్ష్యంగా వ్యూహరచన చేసిన సర్కారుకు హైకోర్టు కళ్లెం వేసింది. మంత్రివర్గ ఉపసంఘం, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తదుపరి చర్యలన్నీ నిలిపివేసింది. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవో, దాని సిఫారసు మేరకు సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవోల ఆధారంగా తదుపరి […]

ప్రభుత్వ వైఖరితో పరువు పోగోట్టుకుంటున్న పోలీస్ శాఖ…?

ఐపీసీ అంటే… ఇండియన్‌ పీనల్‌ కోడ్‌! భారతీయ శిక్షా స్మృతి! కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో మరో అనధికార కోడ్‌ అమలవుతోందనే విమర్శలు వెలువడుతున్నాయి. అదే… వైసీపీ కోడ్‌! ఇది అధికార పార్టీ నేతల సొంత శిక్షా స్మృతి! చాలాచోట్ల అసలు ఐపీసీ కంటే, వైసీపీ కోడ్‌ అమవుతోందని చెబుతున్నారు. పలుమార్లు డీజీపీ స్వయంగా హైకోర్టు ముందు హాజరు కావడం, పోలీసులపై తరచూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడం దీని ఫలితమే! ‘ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థ గాడి తప్పుతోంది. […]

పోలిస్ వ్యవస్థపై… విరుచుకుపడ్డ హైకోర్ట్…

ఏపీ పోలీస్ వ్యవస్థపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఏపీలో పోలీస్ వ్యవస్ద గాడితప్పుతుందని న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో ‘రూల్ ఆప్ లా’ అమలు కావడం లేదని కోర్టు మండిపడింది. గతంలో డీజీపీని పలుసార్లు కోర్టుకు పిలిపించినా మార్పు రాలేదని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు.. పోలీసు వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ రాజీనామా చేయాలని హైకోర్టు ఒకింత కన్నెర్రజేసింది.!. పూర్తి వివరాల్లోకెళితే.. అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అదృశ్యంపై హైకోర్టులో హెబియస్ […]

కాళోజీ రావ్ ప్రజల గుండే చప్పుడు

రాజకీయ, సాంఘిక చైతన్యం ఉన్న వ్యక్తులే ప్రజల కోసం పాటుపడతారు. నిరంకుశత్వాన్ని, సామ్రాజ్యవాదాన్ని ఎదిరించే తెగువ కలిగి ఉంటారు. వారికి ప్రాణ భయంగానీ, జైలు భయంగానీ ఉండదు. ఆ కోవకు చెందినవారే కవి కాళోజీ. తెలంగాణ విముక్తి పోరాటం, ప్రత్యేక తెలంగాణ పోరాటం, ప్రజా హక్కుల పోరాటం లాంటి ప్రతీ పోరాటానికి ప్రతిధ్వనిగా నిలిచిన యోధుడు. ప్రజాస్వామ్యం బతకాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాలి. ఎదురు తిరిగి ప్రశ్నించే వాడుండాలి. ఆ కొరత కాళోజీ తీర్చాడు. అయన అసలు […]