అమరావతి గురించి మరో అప్డేట్…

ఏపీసీఆర్డీయే స్థానంలో ఇటీవల ఏర్పాటైన ఏఎంఆర్డీయే (అమరావతి మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) తన పరిధిలో జరుగుతున్న అతిక్రమణలు, నియమ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడానికి తర్జనభర్జన పడుతోంది. తన పరిధిలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి చుట్టుపక్కల కొందరు రియల్టర్లు, ప్రమోటర్లు, బిల్డర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసినప్పటికీ ఎలా ముందుకు వెళ్లాలో తేల్చుకోలేకపోతోంది. ఇందుకు కారణం.. తన ‘అస్థిత్వం’పై సంస్థకు ఉన్న అనుమానాలే. స్థానిక సంస్థలకే అజమాయిషీ యోచన కారణాలేమైనా.. నెలల తరబడి […]

అమరావతి విషయంలో అలా చేయాలన్నా కుదరదు…

అమరావతిని అటకెక్కించేందుకు, విపక్ష నేతలపై గురి పెట్టేందుకు ఎంచుకున్న ఒక అస్త్రం… ‘రాజధాని భూముల్లో కుంభకోణం… ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’! అయితే… 2012, 2013తో పోల్చితే 2014లో అమరావతి ప్రాంతంలో అసాధారణమైన, అసహజ రీతిలో భూ లావాదేవీలు ఏవీ జరగలేదని రిజిస్టర్‌ అయిన డాక్యుమెంట్ల సంఖ్యను కూడా వివరిస్తూ గురువారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. ఆ విషయాన్ని పక్కనపెడితే… రాష్ట్ర విభజనంటూ జరిగితే, గుంటూరు-విజయవాడ మధ్యే రాజధాని వస్తుందనేది ప్రజల్లో ఉన్న విస్తృతమైన అభిప్రాయం. తెలంగాణ ఉద్యమం […]

ప్రభుత్వ వైఖరితో పరువు పోగోట్టుకుంటున్న పోలీస్ శాఖ…?

ఐపీసీ అంటే… ఇండియన్‌ పీనల్‌ కోడ్‌! భారతీయ శిక్షా స్మృతి! కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో మరో అనధికార కోడ్‌ అమలవుతోందనే విమర్శలు వెలువడుతున్నాయి. అదే… వైసీపీ కోడ్‌! ఇది అధికార పార్టీ నేతల సొంత శిక్షా స్మృతి! చాలాచోట్ల అసలు ఐపీసీ కంటే, వైసీపీ కోడ్‌ అమవుతోందని చెబుతున్నారు. పలుమార్లు డీజీపీ స్వయంగా హైకోర్టు ముందు హాజరు కావడం, పోలీసులపై తరచూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడం దీని ఫలితమే! ‘ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థ గాడి తప్పుతోంది. […]

ఏపీలో కోటి మందికి వైరస్… వెల్లడించిన సర్వే

ఆంధ్రప్రదేశ్‌ జనాభా సుమారు 5 కోట్లు! అధికారికంగా నమోదైన కరోనా కేసులు ఐదు లక్షలకు పైనే! కానీ… మొత్తం జనాభాలో 19.7 శాతం మందికి, అంటే దాదాపు కోటి మందికి కరోనా వైరస్‌ సోకి వెళ్లిపోయిందని సీరో సర్వేలో తేలింది. రక్తంలోని సీరంలో ఉన్న యాంటీ బాడీస్‌ ఆధారంగా కరోనా వైరస్‌ సోకిందా లేదా అనే విషయాన్ని గుర్తించవచ్చు. వైరస్‌ వ్యాప్తి తీవ్రతను గుర్తించేందుకు ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సీరో సర్వే నిర్వహించింది. […]

మరోకసారి ఏపీ నెం 1

‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లో ఆంధ్రప్రదేశ్‌ మరోసారి సత్తా చాటింది. జాతీయ స్థాయిలో వరుసగా నాలుగో ఏడాది ప్రథమ స్థానంలో నిలిచింది. 2018-19 సంవత్సరానికి సంబంధించిన ర్యాంకులను శనివారం కేంద్రం ప్రకటించింది. సులభతర వ్యాపార నిర్వహణ (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌స)పై వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను పరిశీలించి, వాటిపై పారిశ్రామికవేత్తల్లో సర్వే చేసి ఈ ర్యాంకులను ప్రకటిస్తారు. ‘రాష్ట్ర వ్యాపార ప్రక్రియ సంస్కరణలు-19’ పేరుతో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలవగా… […]

రాష్ట్రంలో దళితులకు అన్యాయం చెస్తుంది ఎవరు…?

ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్.ఆర్.సి.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ 15 నెలల కాలంలో వివిధ జిల్లాల్లో దళితులు, గిరిజనులపై 60కి పైగా దాడులు జరిగాయి. అంటే వారానికి ఒక్క దాడి చొప్పున జరిగింది. ఇవిగాక మీడియా, ప్రజాసంఘాలు, రాజ కీయ పార్టీల దృష్టికిరాని సంఘటనలు ఇంకా చాలా ఉన్నాయి. వై.ఎస్‌. ఆర్‌.సి.పి ప్రభుత్వం 2019 మే 30న అధికారం చేపట్టిన వెంటనే పల్నాడు ప్రాంతంలో ఆత్మకూరు తదితర గ్రామాల నుంచి వేలాదిమంది దళితులపై దాడులు చేసి వారిని […]

శ్రీకాకుళం వైసీపీ నేతలు అగ్రహం…

ఆ నాయకుడికి ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర పని చేసిన అనుభవం ఉంది. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఓ వెలుగు వెలిగారు. ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెడుతూ దూసుకుపోయావారు. కానీ పార్టీ మారాక ఆయన ఫేటే మారిపోయింది. పార్టీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డారు. కానీ పదవుల్లో మాత్రం ఆ పార్టీ అధిష్టానం ఆయనకు మొండి చేయి చూపించింది. ఆ నాయకుడి సేవలను అన్ని రకాలుగా ఉపయోగించుకుని కరివేపాకులా తీసి పారేసింది. ఇంతకీ ఎవరానేత?.ఏంటా కథ?. శ్రీకాకుళం […]

గంటకు 9 కోట్ల అప్పు! జరుగుతుందా..?

వైసీపీ అధికారంలో కి వచ్చాక 15 నెలల కాలంలో తెచ్చిన అప్పులను విశ్లేషిస్తే సరాసరిన గంటకు రూ.9 కోట్ల చొప్పున తెచ్చిందని టీడీపీ మండిపడింది. సుమారు రూ.లక్ష కోట్ల మేర అప్పులు తెచ్చారని, ఇంత తెచ్చి ఏం చేశారంటే నిర్దిష్టంగా ఏదీ కనిపించడం లేదని విమర్శించింది. అప్పులు తెచ్చే వేగం చూస్తే ఐదేళ్లు పూర్తయ్యేసరికి రూ.నాలుగైదు లక్షలు దాటిపోయినా ఆశ్చర్యపోనక్కరలేదని, అదేజరిగితే రాష్ట్రం దివాలా తీయడం ఖాయమని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు ఆదివారం టీడీపీ అధికార […]

దుర్వినియోగం అవుతున్న ప్రజా సొత్తు… రాష్ట్రంలో అసలేం జరుగుతుంది…

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనల పేరిట భారీస్థాయిలో ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని, వాటి జారీలో పక్షపాత ధోరణి చూపుతోందని గురువారం హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. ప్రభుత్వ ప్రకటనల్లో సింహభాగం జగతి పబ్లికేషన్‌ నడుపుతున్న సాక్షి దినపత్రిక, ఇందిరా టెలివిజన్‌కి చెందిన సాక్షి టీవీకి మాత్రమే ఇస్తున్నట్టు పిటిషనర్‌ కోర్టుకు ఆధారాలు సమర్పించారు. ప్రభుత్వ చర్యలతో అర్హత ఉన్న సంస్థలు నష్టపోతుండగా, అర్హత లేని కొన్ని మీడియా సంస్థలకు భారీ లబ్ధి కలుగుతోందంటూ విజయవాడకు చెందిన కిలారు నాగశ్రవణ్‌ […]

మనకు వైరస్ వచ్చి వెళ్ళింది.. అసలు విషయం ఇదే..

జిల్లాలో సీరో సర్వే బుధవారం నుంచి ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరిగే ఈ సర్వేలో 5 వేల మంది నమూనాలు సేకరిస్తారు. అనంతరం చెన్నైలోని ల్యాబ్‌లో పరిశీలించి ఫలితాలు వెల్లడిస్తారు. అర్బన్‌, రూరల్‌ ప్రజల్లో ఇప్పటి వరకు పరీక్షలు చేయుయించుకోని వారిని ఈ సర్వేకి ఎంపిక చేస్తున్నారు. తొలిదశలోనే ఈ సర్వే జిల్లాలో చేపట్టాల్సి ఉన్నా నెల్లూరుకు మళ్లింది. మలి దశలో కర్నూలు జిల్లాలో చేపట్టారు. హెల్త్‌, మునిసిపల్‌ వర్కర్లు, పోలీసులు, ఫీవర్‌ క్లినిక్స్‌, ఖైదీలు, […]