ప్రభుత్వానికి, రమేష్ కుమార్ నుండీ ఉహించని రియాక్షన్…

ఎస్‌ఈసీ రమేష్‌కుమార్‌ తొలగింపుపై ప్రభుత్వ కౌంటర్‌కు అభ్యంతరాలు తెలుపుతూ పలువురు పిటిషనర్లు అఫిడవిట్లు దాఖలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ తరపున కూడా లాయర్ కౌంటర్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కౌంటర్‌కు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సమాధానమిచ్చారు. తనను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి పదవీ కాలాన్ని తగ్గించాలని ఏ నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేయలేదన్నారు. తనను తొలగిస్తూ ఇచ్చిన జీవోను..ఆర్డినెన్స్‌ను కొట్టేసి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కౌంటర్‌లో రమేష్ కుమార్ పేర్కొన్నారు.

 

ప్రభుత్వం చెబుతున్న ఎన్నికల సంస్కరణల వెనుక దురుద్దేశం ఉందని తెలిపారు. ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలంటే నిపుణుల కమిటీ వేస్తారని చెప్పారు. అర్ధరాత్రి సంస్కరణలు తీసుకురారన్నారు. కరోనా కారణంగానే ఎన్నికలు వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్‌కు ముందు రోజు ఎన్నికలు వాయిదా వేశామనడం అసత్యమని.. నిపుణుల సూచనల తర్వాతే ఎన్నికలు వాయిదా వేశామని చెప్పారు. సీఎంతో సహా స్పీకర్‌, మంత్రులు మాటల దాడి చేశారని, కులాన్ని ఆపాదించడం అభ్యంతరకరమని కౌంటర్‌లో రమేష్‌కుమార్ పేర్కొన్నారు.

"
"