రోజారెడ్డిని బుక్‌చేసిన‌ పెద్దిరెడ్డి

బోరింగు ఓపెనింగుకి వెళ్లి పూలు చల్లించుకోవడం..దానిని వీడియో తీసి నేషనల్ మీడియా వ‌ర‌కూ చేర‌వేసి రోజారెడ్డిని దారుణంగా దెబ్బ‌తీయ‌డంలో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి హ‌స్తం ఉంద‌ని రోజా ర‌గిలిపోతున్నారు. వాస్త‌వంగా రోజా వెళ్లిన కార్య‌క్ర‌మాన్ని షూట్ చేయ‌డానికి తెలుగుదేశం వారు కానీ, సోష‌ల్ మీడియా వాళ్లు కానీ ఎవ‌రూ లేరు. అక్క‌డున్న వైఎస్సార్‌సీపీ వాళ్లే వీడియో తీసి మ‌రీ నేష‌న‌ల్ మీడియా వ‌ర‌కూ చేర‌వేయించ‌గ‌లిగారు. దీనివెనుక మంత్రి పెద్దిరెడ్డి ఉన్నార‌ని రోజాకి క్లియ‌ర్‌గా తెలుసు. అయినా పార్టీ వేదిక‌ల‌పైనే తేల్చుకోవాల‌ని దీని గురించి ఆమె మాట్లాడ‌టంలేదు.

 

రోజాకి మంత్రి ప‌ద‌వి రాకుండా అడ్డుకోవ‌డం నుంచీ ఇలా సోష‌ల్ మీడియా, మీడియాలో బ‌ద్నాం చేయ‌డం వ‌ర‌కూ అన్నీ పెద్దిరెడ్డి అత‌ని అనుయాయులు చేయిస్తున్నార‌ని రోజా నిర్ధారించుకున్నారు. ఐర‌న్‌లెగ్‌గా ముద్ర వేయించుకుని..ఎట్ట‌కేల‌కు తాను గెలిచి..త‌న పార్టీ గెలిచిన సంద‌ర్భంలో రెడ్డి, మ‌హిళ‌, ఫైర్‌బ్రాండ్‌, సినీ గ్లామ‌ర్ అన్నీ క‌లిసొచ్చి మంత్రి అయిపోయాన‌నుకున్న ద‌శ‌లో పెద్దిరెడ్డి కొట్టిన దెబ్బ‌కు జీవితంలో కోలుకోలేనంత‌గా రోజా రెడ్డి కుంగిపోయింది. అయినా పెద్దిరెడ్డిని ఢీకొనే స‌త్తాలేదు. నోటితో అయితే ఢీకొన‌గ‌ల‌దు..నోట్ల‌తోనూ, ప‌వ‌ర్ ఫైట్‌తోనూ ఏం చెయ్య‌లేదు. అందుకే అవ‌కాశం కోసం ఎదురుచూస్తోంది. ఇది గ‌మ‌నించిన పెద్దిరెడ్డి రోజారెడ్డి లేచిన ప్ర‌తీసారీ ఏదో ఒక దెబ్బ‌కొడుతూ కోలుకోలేకుండా చేస్తున్నారు. బంతిపూలు చ‌ల్లించుకున్న రోజా ఆనందం పూలు వాడిపోయినంత‌వ‌ర‌కూ లేకుండానే ఆవిరైంది.

"
"