మరోక్కసారి వైసీపీకి చుక్కలు చూపించిన రఘురామకృష్ణం రాజు…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇంటి పోరు ఇంతింత కాదయా అన్నట్టుగా తయారైంది.ముఖ్యంగా నరసాపురం లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజు వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది.
సొంత పార్టీలోనే ఉంటూ, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్న ఆయన తీరుతో వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి ఆయన వివాదాస్పదంగా విమర్శలు చేస్తుండడంతో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసినా ఆయన మాత్రం ఎక్కడా తగ్గేది లేదు అన్నట్టుగా నిత్యం అనేక సమస్యలపై తన గళం విప్పుతూనే వస్తున్నాడు.ప్రతిపక్షాలకు మించిన విధంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.పార్టీ ఆయనను సస్పెండ్ చేస్తుందనే అభిప్రాయంతో రఘురామకృష్ణంరాజు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నా, వైసీపీ అధిష్టానం మాత్రం పెద్దగా పట్టించుకోనట్లుగానే వ్యవహరిస్తుండడంతో రాజుగారు తన విమర్శలకు పదును పెట్టారు.

 

అసలు రఘురామకృష్ణం రాజును వైసిపిని పట్టించుకోనట్టు గానే వ్యవహరిస్తున్నా, ఆయన మాత్రం తాను వదిలిపెట్టేది లేదు అన్నట్లుగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు.పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆయనపై అనర్హత వేయాల్సిందిగా లోక్ సభ స్పీకర్ కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పిటిషన్ అందించింది.అయితే ఇప్పటి వరకు ఆ పిటిషన్ పై ఎటువంటి నిర్ణయము తీసుకోకపోవడంతో, ఆయన విషయంలో ఏం చేయాలనే సందిగ్ధంలో వైసీపీ ఉంది.ఇది కాకపోతే రఘురామకృష్ణంరాజు మాత్రం వైసిపి తనపై అనర్హత వేయించినా, మళ్లీ తాను అదే నర్సాపురం లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నిలబడతానని, అప్పుడు తనక ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని పార్టీల మద్ధతు ఉండేలా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నట్లు గా కనిపిస్తున్నారు.
దీనిలో భాగంగానే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులతో మంతనాలు కూడా చేసినట్లు తెలుస్తోంది.నరసాపురంలో ఉపఎన్నికలు వస్తే ఖచ్చితంగా తాను పోటీ చేసి గెలుపొందే విధంగా ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్లు గా కనిపిస్తున్నారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని దించకుండా, తనకు మద్దతు ఇచ్చే విధంగా ఇప్పటికే రఘురామకృష్ణంరాజు చంద్రబాబు నుంచి హామీ పొందినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఒకవేళ రఘురామకృష్ణంరాజు భావించినట్టు గానే నరసాపురం లో ఉపఎన్నికలు వస్తే, రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశం ఉంటుంది.ఇప్పటికే ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించుకుని తమ సత్తా చాటుకునే విధంగా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

"
"