ప్రధాన మంత్రి కి, జగన్ విన్నపం ఏమిటంటే…?

వైఎస్ జగన్  ప్రస్తుతం ఆయన  కెంద్రానికి కాస్త సన్నిహితంగా వుంటున్నారు. కోన్ని రాజకీయ పరీస్థీతుల కారణంగా కెంద్రం కూడా జగన్ వైసీపీ తో సన్నిహితంగానే వుంటుంది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం తర్వాత సడన్‌గా ఏపీ ముఖ్యమంత్రికి ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ లభించడం రాజకీయవర్గాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. అయితే, సుమారు గంటన్నరపాటు సాగిన వారిద్దరి భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు పలు రాజకీయ విషయాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి అందిన సమాచారం ప్రకారం వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి ఓ ఎంపీని పంపాలని, అందుకు వైసీపీ ప్రభుత్వం సహకారం అందించాలని కోరినట్టు తెలిసింది.

 

2014 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత టీడీపీ – బీజేపీ పొత్తులో భాగంగా ఓ బీజేపీ ఎంపీని ఏపీ నుంచి పంపారు. సురేష్ ప్రభును ఏపీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్నుకుని రాజ్యసభకు పంపారు. విశాఖకు రైల్వే జోన్ ఇస్తారంటే.. ఏకంగా రైల్వే మంత్రినే ఇచ్చారంటూ అప్పట్లో బీజేపీ నేతలు ప్రకటించారు. అయితే, ఇప్పుడు కూడా ప్రధాని మోదీ… జగన్ ముందు ఓ బీజేపీ ఎంపీని రాజ్యసభకు పంపాలని కోరినట్టు తెలిసింది. దీంతోపాటు కేంద్ర కేబినెట్‌లో కూడా చేరాలని జగన్‌ను కోరినట్టు ప్రచారం జరుగుతోంది.అన్నీ అనుకున్నట్టు జరిగి బీజేపీ ఎంపీని ఎన్నుకోవడానికి వైసీపీ సిద్ధమైతే.. కేంద్రంలో ఆ పార్టీకి రెండు మంత్రి పదవులు ఖాయమైనట్టే. ఇప్పటికే వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పేర్లు ప్రతిపాదించినట్టు కూడా ప్రచారం జరుగుతోంది.2020 ఏప్రిల్ 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు ఎంపీలు రిటైర్ అవుతారు.

 

టి.సుబ్బిరామిరెడ్డి, మొహమ్మద్ అలీ ఖాన్, తోట సీతారామలక్ష్మి, కె.కేశవరావు (రాష్ట్ర విభజన సందర్భంగా తీసిన లాటరీలో కేకేను ఏపీకి కేటాయించారు.) రిటైర్ అవుతారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న వైసీపీకి ముగ్గురు సభ్యులు కచ్చితంగా దక్కుతారు. టీడీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగితే నాలుగో ఎంపీ కూడా వైసీపీకి దక్కే అవకాశం ఉంది. ఆ లెక్కన ఆ నాలుగో ఎంపీ టికెట్‌ను బీజేపీకి కేటాయించి.. వారిని గెలిపించుకునే బాధ్యత కూడా బీజేపీ భుజాన వేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది.

"
"