ప్రభుత్వం అనుకున్నదే చేసింది… రాజధానిపై సంచలన నిర్ణయం.

చివరికి  ఏపీ ప్రభుత్వం అనుకున్న నీర్ణయం చెప్పింది. ఇక  రాజధాని వికెంద్రకరణ దాదాపుగా లాంచనమే అనే పరీస్థీతులు ఇక్కడ తీసుకుని వచ్చారు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. మొత్తం నాలుగు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధానిపై ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ నివేదికకు మంత్రివర్గం ఓకే చెప్పింది. దీంతో పాటు 11వేల రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చేందుకు కూడా ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. భూములిచ్చిన రైతలుకు కౌలు 10 నుంచి 15 ఏళ్లకు పెంచారు.

 

సీఆర్డీయే చట్టం ఉపసంహరణ, పరిపాలన వికేంద్రీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.అమరావతిలోనే మూడు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా విశాఖలో సచివాలయం ఏర్పాటు చేసి, హెచ్ఓడీ కార్యాలయాలు కూడా అక్కడే ఏర్పాటు చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. పులివెందుల అర్బన్ అథారిటీ డెవలప్ మెంట్‌కు కూడా ఆమోదం తెలిపింది. శాసన రాజధనిగా అమరావతి, పరిపాలన రాజధానిగా విశాఖను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది.

"
"