పోల‌వ‌రంపై బీజేపీ మైండ్‌గేమ్‌లో వైసీపీ సెల్ఫ్ గోల్‌

పోల‌వ‌రం.. ఇది రెండు నాలుగు రాజ‌కీయ పార్టీకు ఓ వ‌రం.. ఇప్పుడు ఇది ఈ రాజ‌కీయ పార్టీల‌కు రంజుగా మారిన రాజ‌కీయ వ‌రం. మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌ధానంగా రెండు పార్టీలకు ఈ ప్రాజెక్టు ప్ర‌తిష్టాత్మ‌కం.. ఒక పార్టీకి ఇది వ‌రం.. ఒక పార్టీకి క‌ల‌వ‌రం ఈ పోల‌వ‌రం. అయితే ఇప్పుడు ఆ ప‌రిస్థితి మారింది. అప్పుడు వ‌రంగా ఉన్న పార్టీకి ఇది క‌ల‌వ‌రంగా మారింది.. అప్పుడు క‌ల‌వ‌రంగా ఉన్న పార్టీకి ఇప్పుడు వ‌రంగా మారింది. అయితే ఈ మార్పు చేర్పుల్లో.. ఓ జాతీయ పార్టీకి ఈ రెండు పార్టీల‌ను కార్న‌ర్ చేసే ఓ అద్బుత వ‌రంగా మారింది.ఓ జాతీయ పార్టీ ఈ ప్రాజెక్టు ప్రాణం పోసింది.. కానీ ఆ పార్టీ ఇప్పుడు ప్రాణంలేకుండా పోయింది.. దీంతో ఆ పార్టీ ఈ పోల‌వ‌రంపై ప‌ల్లెత్తు మాట మాట్లాడ‌లేని నైరాశ్య స్థితిలో ఉంటే.. ఓ జాతీయ పార్టీ రెండు ప్రాంతీయ పార్టీల వీక్‌నెస్‌తో ఆడుకుంటుంది. ఇది రెండు పార్టీల‌కు ప్రాణ సంక‌టంగా మారింది. ఇంత‌కు ఈ పోల‌వ‌రం ఎవ‌రికి వ‌రంగా మారింది.. ఎవ‌రికి క‌ల‌వ‌రంగా మారింది.. ఎవ‌రికి అద్భుత అవ‌కాశంగా మారింది.. ఎవ‌రికి ప్రాణం తీసింది.. ఓసారి పరిశీలిస్తే..

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాల‌న‌లో కొంత మేర‌కు ప‌నులు జ‌రిగాయి. కానీ త‌రువాత ప్రాజెక్టు ఆగిపోయింది. తెలంగాణ విడిపోవ‌డంతో పోల‌వ‌రంకు జాతీయ హోదా ద‌క్కింది. అంతే 2014 ఎన్నిక‌ల్లో కేంద్రంలో బీజేపీ, ఏపీ రాష్ట్రంలో టీడీపీ పాగా వేసింది. కాంగ్రెస్ పోల‌వ‌రంను జాతీయ ప్రాజెక్టుగా ప్ర‌క‌టించ‌డంతో దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్య‌త కేంద్రం పై ప‌డింది. అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాల‌నుకున్న ద‌శ‌లో టీడీపీ ఈ ప్రాజెక్టును జాతీయ‌ప్రాజెక్టుగానే ఉంచి.. రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్మించే అవ‌కాశం ఇవ్వాల‌ని కోరింది. అంటే జాతీయ ప్రాజెక్టు, రాష్ట్రం చేప‌ట్టే విధంగా చంద్ర‌బాబు చక్రం తిప్పారు. ఇక అప్ప‌టి నుంచి పోల‌వ‌రం ప్రాజెక్టు నాలుగు అడుగులు ముందుకు రెండు అడుగులు వెన‌క్కి పోవ‌డం మొద‌లైంది. పోలవరం ప్రాజెక్ట్ గత 5 ఏళ్ళ కాలంలో, చంద్రబాబు కొంత మేర‌కు ప‌నులు చేయ‌గ‌లిగారు. ప్రాజెక్ట్ కు ఒక రూపు వచ్చింది. ఈ ప్రాజెక్టు టీడీపీ చేతికి చిక్క‌డం వ‌రంగా మారింది.

అయితే ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైసీపీ ప్రాజెక్టులో అవినీతి జ‌రుగుతుంద‌ని ఆనాటి నుంచి విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. దీంతో అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే వైసీపీ పోల‌వ‌రంలో రివ‌ర్స్ టెండ‌రింగ్ అంటూ ప‌నుల‌ను ఆపింది. ఓ నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేసింది. కొన్ని కోర్టు కేసులు కూడా అయ్యాయి. దీంతో పోల‌వ‌రం ఆగిపోయింది. రివ‌ర్స్ టెండ‌రింగ్ జ‌రిగింది.. నిపుణుల క‌మిటీ నివేధిక ఇచ్చింది.. కోర్టు కేసులు కొన్ని కొలిక్కి వ‌చ్చాయి.. అయితే ఇక్క‌డే వైసీపీ ప్ర‌భుత్వానికి పోల‌వ‌రం కొన్ని అద్భుత అవ‌కాశాలు ఇచ్చింది.రివ‌ర్స్ టెండ‌రింగ్‌లో దాదాపు వెయ్యి కోట్లు మిగిల‌డం జ‌రిగింది. అయితే నిపుణుల క‌మిటీ ఇచ్చిన నివేదిక ఇక్క‌డ వైసీపీకి షాక్ ఇచ్చింది. జ‌ల‌శ‌క్తి మంత్రి ర‌త‌న్ లాల్ క‌టారియా విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. అదనపు చెల్లింపులు చేసింది నిజమే కాని, ఎక్కడా రూల్స్ అతిక్రమించి, చెల్లింపులు చెయ్యలేదని, ఏపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ చెప్పిందని, దీనికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం, నవంబర్ 11న ఒక లేఖ కూడా మాకు రాసిందని చెప్పారు.

ప‌నిలో ప‌నిగా ఎలాంటి అవకతవకలు జరగలేదని, అన్నీ రూల్స్ ప్రకారమే జరిగాయని, ఏకంగా లేఖ రూపంలో, కేంద్రానికి చెప్పటం, అదే విషయం, కేంద్రం రాజ్యసభలో చెప్పటం విని షాక్ అయ్యారు. విజయసాయి రెడ్డి, చంద్రబాబుని ఫిక్స్ చేద్దమనుకుంటే, మనమే ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చి, సెల్ఫ్ గోల్ వేసుకున్నామని అనుకుంటున్నారు.అయితే ఇక్క‌డ బీజేపీ ఆడిన నాట‌కంలో చంద్ర‌బాబు సేఫ్ జోన్‌లోకి వెళ్ల‌గా, వైసీపీ డేంజ‌ర్ డోన్‌లోకి వెళ్లింది. ఏదేమైనా బీజేపీ ఆడిన మైండ్ గేమ్‌లో టీడీపీకి లాభం జ‌రిగింద‌నే వాద‌న వినిపిస్తుంది.

"
"