పెట్రోల్ బంకుల్లో ఇంత మోసం జరుగుతుందా..!

పైకి ‘లెక్కంతా’ బాగానే కనిపిస్తుంది.. లోలోన మాత్రం ‘తేడా’ జరిగిపోతుంది..! వినియోగదారు జేబుకు రూపాయిల్లో చిల్లు పడుతుంది.. మోసగాళ్లకు మాత్రం రూ.లక్షల్లో రాబడి దక్కుతుంది..! అక్రమాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం టెక్నాలజీని ప్రవేశపెడితే.. గప్‌‘చి్‌ప’గా దానికిమించిన ఎత్తుగడలతో కేటుగాళ్ల ఆట సాగుతోంది..! ‘మీటర్‌ రీడింగ్‌’ యంత్రం లోపలి బోర్డును అత్యాధునిక ఇంటిగ్రేటెడ్‌ చిప్‌తో మార్చి తెలుగు రాష్ట్రాల్లోని పెట్రోల్‌ బంకుల్లో జరుగుతున్న దందా ఇది..!పెట్రోల్‌బంకుల్లోని పంపింగ్‌ (రీడింగ్‌) మిషన్‌లో రెండు బోర్డులు ఉంటాయి. ఒకటి బయటకు కనిపిస్తే.. మరొకటి లోపల ఉంటుంది. లోపలి బోర్డులోని చిప్‌ను తొలగించి ఇంటిగ్రేటెడ్‌ చిప్‌ను బిగిస్తారు. దీంతో పెట్రోల్‌ లీటర్‌కు 3 శాతం రీడింగ్‌ (30 మిల్లీ లీటర్లు) తక్కువగా నమోదవుతుంది. బయట బోర్డులో మాత్రం లీటరు కొలత చూపిస్తుంది. అసలే హడావుడిగా పెట్రోల్‌ బంకులోకి వెళ్లే జనం.. డిజిటల్‌ తెరపై కనిపించే రీడింగ్‌ను చూసి ‘అడిగినంత కొట్టారులే’ అని వెళ్లిపోతుంటారు. తెలుగు రాష్ట్రాల్లోని పదుల సంఖ్యలో పెట్రోల్‌ బంకుల్లో ఏడాదిపైగా సాగుతున్న ఘరానా దందాపై విశ్వసనీయ సమాచారం అందుకున్న సీపీ సజ్జనార్‌.. ఎస్‌వోటీ అడిషనల్‌ డీసీపీ సందీప్‌, షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌, ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ రమణారెడ్డి, నందిగామ ఇన్‌స్పెక్టర్‌ రామయ్యతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. పకడ్బందీ ప్రణాళికతో అక్రమార్కుల ఆట కట్టించారు. మోసానికి టెక్నాలజీ సమకూర్చిన నలుగురు సహా.. 9మంది పెట్రోల్‌ బంక్‌ యజమానులను అరెస్టు చేశారు.తెలంగాణలో 11, ఆంధ్రప్రదేశ్‌లో 22 పెట్రోల్‌ బంకులను సీజ్‌ చేశారు. నిందితుల నుంచి రీడింగ్‌ మిషన్లు, చిప్‌లను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో శనివారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన సుభాని బాషా అలియాస్‌ బాషా పదేళ్లకు పైగా వివిధ పెట్రోల్‌ బంకుల్లో పనిచేశాడు. తక్కువ పెట్రోల్‌తో ఎక్కువ రీడింగ్‌ చూపించి వాహనదారులను మోసం చేయడంపై అవగాహన పొందాడు. అవసరమైన అత్యాధునిక టెక్నాలజీ గురించి తెలుసుకున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఎస్‌.కె.బాజిబాబా, శంకర్‌, మల్లేశ్వరరావు అలియాస్‌ నానితో జట్టు కట్టాడు. బాషా ముఠా తమ ప్లాన్‌ను వివరించ గా.. రోజుకు రూ.2 లక్షలపైగా సంపాదించే అవకాశం ఉండటంతో బంక్‌ యజమానులు ఒప్పుకొన్నారు.లీటర్‌కు రూ.2.55

బంకుల్లో మదర్‌బోర్డు ట్యాంపరింగ్‌తో చేస్తున్న మోసం విలువ లీటరుకు రూ. 2.55..! ఒక బంకులో సగటున రోజుకు 5 వేల లీటర్ల పెట్రోల్‌ను విక్రయిస్తే.. మోసం విలువ రూ. 12,750. హైదరాబాద్‌, నగర శివార్లలో అయితే.. ఒక్కో బంకు రోజుకు సగటు 10 వేల లీటర్ల మేర విక్రయాలు జరుపుతోంది. అంటే.. పెట్రోల్‌ తరుగుతో ఆయా బంకుల యజమానులు అడ్డంగా సంపాదిస్తున్న సొమ్ము విలువ రూ. 25,500. ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోజుకు సగటున 30 లక్షల లీటర్ల పెట్రోల్‌, 33 లక్షల లీటర్ల డీజిల్‌ అమ్మకాలు జరుగుతాయని అంచనా. బంక్‌లో ఉన్న పెట్రోల్‌ మిషన్‌లలో ఉపయోగించిన అన్ని చిప్‌లు ఆపరేట్‌ చేయడానికి ఒక బటన్‌ ఉంటుంది. అధికారులు తనిఖీకి వస్తున్నారని తెలిస్తే.. ‘మానిటరింగ్‌ బటన్‌’ను ఆఫ్‌ చేసి ఆన్‌ చేస్తారు. దీంతో రీడింగ్‌ మిషన్‌ బోర్డులు లోపల, బయట ఒకేలా పనిచేస్తాయి. అధికారులు వెళ్లిపోగానే మళ్లీ బటన్‌ను ఆఫ్‌ చేసి ఆన్‌ చేస్తారు.యథేచ్ఛగా ట్యాంపరింగ్‌

ఐదేళ్ల క్రితం మీటర్‌ ట్యాంపరింగ్‌ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు పెద్దఎత్తున బంకులను సీజ్‌ చేశారు. చమురు సంస్థలు కూడా ఆయా బంకులను బ్లాక్‌లిస్టులో పెట్టాయి. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ సాయంతో అధునాతన కేంద్రీకృత నిఘా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ఒక బంకులో.. నాలుగు యూనిట్లు ఉంటే.. ఏ యూనిట్‌ నుంచి ఏ సమయంలో ఎంత పెట్రోలును విక్రయించారు? రోజువారీగా మారుతున్న ధరలను ఎన్నిగంటలకు అప్‌లోడ్‌ చేశారు? ఏ బంకులో ఎంత స్టాక్‌ ఉంది? కొత్తగా ఎంత లోడింగ్‌ జరిగింది? అనే వివరాలను చమురు సంస్థలు తెలుసుకుంటున్నాయి. అయినా కొందరు నిఘా కళ్లుగప్పుతున్నారు. తూనికలు-కొలతల అధికారులు ఏటా బంకుల పనితీరును పరిశీలించి, సీల్స్‌ వేస్తారు. మీటర్‌ రీడింగ్‌, మీటర్‌ గేర్‌, పంపు, మదర్‌బోర్డు తదితర ప్రాంతాల్లో ఈ సీళ్లు ఉంటాయి. ఆ సీల్‌ను తీయకూడదు. ట్యాంపరింగ్‌ చేయకూడదు. కానీ, సీళ్లను తీసి వేస్తున్నారు.నిందితులు వీరే..

ముఠా సభ్యులు: సుభాని బాషా అలియాస్‌ బాషా, ఎస్‌.కె. బాజిబాబా, మాదసుగురి శంకర్‌, ఇప్పలి మల్లేశ్వరరావు అలియాస్‌ నాని

పెట్రోల్‌ బంక్‌ల యజమానులు: ఒన్నాల రాజు(మాతా ఫిల్లింగ్‌ స్టేషన్‌, కొత్తూరు టౌన్‌), బండి దశరథ్‌ (శిరిడి సాయి ఆటో సర్వీస్‌, ఆర్‌సీ పురం, దుర్గా ఫిల్టింగ్‌ స్టేషన్‌ మియాపూర్‌), కట్టంగూరి అరుణ్‌కుమార్‌ (వినాయక ఫిల్లింగ్‌ స్టేషన్‌, అనంతారం, భువనగిరి), పీసరి విఠల్‌రెడ్డి (దత్తసాయి కెఎ్‌సకె, మోటకొండూరు), పెబ్బా రామచందర్‌ (తిరుమల అండ్‌ విజయ పెట్రోలింగ్‌ బంక్‌, సిరిసిల్ల రోడ్‌, కామారెడ్డి), ముడుసు శివ, మేనేజర్‌ (సాయిగణేశ్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌, మేళ్ల చెరువు, సూర్యాపేట జిల్లా), మరిడి సుధీర్‌ (పరుశరామ్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌, కోదాడ, సూర్యాపేట జిల్లా), జమ్మిగుంపల పరమేశ్వరరావు, మేనేజర్‌ (గాయత్రి ఫ్యూయల్‌ పాయింట్‌, అల్లాదుర్గం, మెదక్‌ జిల్లా), దొడ్డిగొల్ల రంగారెడ్డి (తాజ్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌, కోటపల్లి మల్లేకల్‌, జోగులాంబ-గద్వాల జిల్లా).

పరారీలో ఉన్నవారు: కోదాడకు చెందిన మారం కృష్ణ, హైదరాబాద్‌ శివారులోని నాచారానికి చెందిన యడ్లపల్లి రమేశ్‌, జడ్చర్లకు చెందిన పేటిబండ్ల ప్రదీప్‌, వరంగల్‌కు చెందిన భిక్షపతి, ఏపీలోని ఒంగోలుకు చెందిన వెంకటేశ్వర్లు.2019 నుంచి మోసాలు..

పెట్రోల్‌ బంక్‌ల్లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రభుత్వం 2018 నుంచి అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. అయితే.. కొందరు కేటుగాళ్లు ఆ టెక్నాలజీని కూడా బురిడీకొట్టించే సాఫ్ట్‌వేర్‌ కనిపెట్టారు. ఈ క్రమంలో తయారైన ఇంటిగ్రేటెడ్‌ చిప్‌లను సుభాని బాషా బృందం ముంబై నుంచి దిగుమతి చేసుకుని 2019 నుంచి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ చిప్‌ల విలువ రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు సీజ్‌ చేసిన బంక్‌ల లావాదేవీల సామర్థ్యాన్ని బట్టి కోట్లాది రూపాయలు అక్రమంగా దండుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులను కస్టడీలోకి తీసుకుని, పూర్తి వివరాలు రాబడతామని, ముంబై నుంచి చిప్‌లను సరఫరా చేస్తున్న వారి కోసం గాలిస్తున్నట్లు సీపీ వెల్లడించారు.పైకి ‘లెక్కంతా’ బాగానే కనిపిస్తుంది.. లోలోన మాత్రం ‘తేడా’ జరిగిపోతుంది..! వినియోగదారు జేబుకు రూపాయిల్లో చిల్లు పడుతుంది.. మోసగాళ్లకు మాత్రం రూ.లక్షల్లో రాబడి దక్కుతుంది..! అక్రమాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం టెక్నాలజీని ప్రవేశపెడితే.. గప్‌‘చి్‌ప’గా దానికిమించిన ఎత్తుగడలతో కేటుగాళ్ల ఆట సాగుతోంది..! ‘మీటర్‌ రీడింగ్‌’ యంత్రం లోపలి బోర్డును అత్యాధునిక ఇంటిగ్రేటెడ్‌ చిప్‌తో మార్చి తెలుగు రాష్ట్రాల్లోని పెట్రోల్‌ బంకుల్లో జరుగుతున్న దందా ఇది..!పెట్రోల్‌బంకుల్లోని పంపింగ్‌ (రీడింగ్‌) మిషన్‌లో రెండు బోర్డులు ఉంటాయి. ఒకటి బయటకు కనిపిస్తే.. మరొకటి లోపల ఉంటుంది. లోపలి బోర్డులోని చిప్‌ను తొలగించి ఇంటిగ్రేటెడ్‌ చిప్‌ను బిగిస్తారు. దీంతో పెట్రోల్‌ లీటర్‌కు 3 శాతం రీడింగ్‌ (30 మిల్లీ లీటర్లు) తక్కువగా నమోదవుతుంది. బయట బోర్డులో మాత్రం లీటరు కొలత చూపిస్తుంది. అసలే హడావుడిగా పెట్రోల్‌ బంకులోకి వెళ్లే జనం.. డిజిటల్‌ తెరపై కనిపించే రీడింగ్‌ను చూసి ‘అడిగినంత కొట్టారులే’ అని వెళ్లిపోతుంటారు. తెలుగు రాష్ట్రాల్లోని పదుల సంఖ్యలో పెట్రోల్‌ బంకుల్లో ఏడాదిపైగా సాగుతున్న ఘరానా దందాపై విశ్వసనీయ సమాచారం అందుకున్న సీపీ సజ్జనార్‌.. ఎస్‌వోటీ అడిషనల్‌ డీసీపీ సందీప్‌, షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌, ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ రమణారెడ్డి, నందిగామ ఇన్‌స్పెక్టర్‌ రామయ్యతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. పకడ్బందీ ప్రణాళికతో అక్రమార్కుల ఆట కట్టించారు. మోసానికి టెక్నాలజీ సమకూర్చిన నలుగురు సహా.. 9మంది పెట్రోల్‌ బంక్‌ యజమానులను అరెస్టు చేశారు.తెలంగాణలో 11, ఆంధ్రప్రదేశ్‌లో 22 పెట్రోల్‌ బంకులను సీజ్‌ చేశారు. నిందితుల నుంచి రీడింగ్‌ మిషన్లు, చిప్‌లను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో శనివారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన సుభాని బాషా అలియాస్‌ బాషా పదేళ్లకు పైగా వివిధ పెట్రోల్‌ బంకుల్లో పనిచేశాడు. తక్కువ పెట్రోల్‌తో ఎక్కువ రీడింగ్‌ చూపించి వాహనదారులను మోసం చేయడంపై అవగాహన పొందాడు. అవసరమైన అత్యాధునిక టెక్నాలజీ గురించి తెలుసుకున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఎస్‌.కె.బాజిబాబా, శంకర్‌, మల్లేశ్వరరావు అలియాస్‌ నానితో జట్టు కట్టాడు. బాషా ముఠా తమ ప్లాన్‌ను వివరించ గా.. రోజుకు రూ.2 లక్షలపైగా సంపాదించే అవకాశం ఉండటంతో బంక్‌ యజమానులు ఒప్పుకొన్నారు.లీటర్‌కు రూ.2.55

బంకుల్లో మదర్‌బోర్డు ట్యాంపరింగ్‌తో చేస్తున్న మోసం విలువ లీటరుకు రూ. 2.55..! ఒక బంకులో సగటున రోజుకు 5 వేల లీటర్ల పెట్రోల్‌ను విక్రయిస్తే.. మోసం విలువ రూ. 12,750. హైదరాబాద్‌, నగర శివార్లలో అయితే.. ఒక్కో బంకు రోజుకు సగటు 10 వేల లీటర్ల మేర విక్రయాలు జరుపుతోంది. అంటే.. పెట్రోల్‌ తరుగుతో ఆయా బంకుల యజమానులు అడ్డంగా సంపాదిస్తున్న సొమ్ము విలువ రూ. 25,500. ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోజుకు సగటున 30 లక్షల లీటర్ల పెట్రోల్‌, 33 లక్షల లీటర్ల డీజిల్‌ అమ్మకాలు జరుగుతాయని అంచనా. బంక్‌లో ఉన్న పెట్రోల్‌ మిషన్‌లలో ఉపయోగించిన అన్ని చిప్‌లు ఆపరేట్‌ చేయడానికి ఒక బటన్‌ ఉంటుంది. అధికారులు తనిఖీకి వస్తున్నారని తెలిస్తే.. ‘మానిటరింగ్‌ బటన్‌’ను ఆఫ్‌ చేసి ఆన్‌ చేస్తారు. దీంతో రీడింగ్‌ మిషన్‌ బోర్డులు లోపల, బయట ఒకేలా పనిచేస్తాయి. అధికారులు వెళ్లిపోగానే మళ్లీ బటన్‌ను ఆఫ్‌ చేసి ఆన్‌ చేస్తారు.యథేచ్ఛగా ట్యాంపరింగ్‌

ఐదేళ్ల క్రితం మీటర్‌ ట్యాంపరింగ్‌ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు పెద్దఎత్తున బంకులను సీజ్‌ చేశారు. చమురు సంస్థలు కూడా ఆయా బంకులను బ్లాక్‌లిస్టులో పెట్టాయి. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ సాయంతో అధునాతన కేంద్రీకృత నిఘా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ఒక బంకులో.. నాలుగు యూనిట్లు ఉంటే.. ఏ యూనిట్‌ నుంచి ఏ సమయంలో ఎంత పెట్రోలును విక్రయించారు? రోజువారీగా మారుతున్న ధరలను ఎన్నిగంటలకు అప్‌లోడ్‌ చేశారు? ఏ బంకులో ఎంత స్టాక్‌ ఉంది? కొత్తగా ఎంత లోడింగ్‌ జరిగింది? అనే వివరాలను చమురు సంస్థలు తెలుసుకుంటున్నాయి. అయినా కొందరు నిఘా కళ్లుగప్పుతున్నారు. తూనికలు-కొలతల అధికారులు ఏటా బంకుల పనితీరును పరిశీలించి, సీల్స్‌ వేస్తారు. మీటర్‌ రీడింగ్‌, మీటర్‌ గేర్‌, పంపు, మదర్‌బోర్డు తదితర ప్రాంతాల్లో ఈ సీళ్లు ఉంటాయి. ఆ సీల్‌ను తీయకూడదు. ట్యాంపరింగ్‌ చేయకూడదు. కానీ, సీళ్లను తీసి వేస్తున్నారు.నిందితులు వీరే..

ముఠా సభ్యులు: సుభాని బాషా అలియాస్‌ బాషా, ఎస్‌.కె. బాజిబాబా, మాదసుగురి శంకర్‌, ఇప్పలి మల్లేశ్వరరావు అలియాస్‌ నాని

పెట్రోల్‌ బంక్‌ల యజమానులు: ఒన్నాల రాజు(మాతా ఫిల్లింగ్‌ స్టేషన్‌, కొత్తూరు టౌన్‌), బండి దశరథ్‌ (శిరిడి సాయి ఆటో సర్వీస్‌, ఆర్‌సీ పురం, దుర్గా ఫిల్టింగ్‌ స్టేషన్‌ మియాపూర్‌), కట్టంగూరి అరుణ్‌కుమార్‌ (వినాయక ఫిల్లింగ్‌ స్టేషన్‌, అనంతారం, భువనగిరి), పీసరి విఠల్‌రెడ్డి (దత్తసాయి కెఎ్‌సకె, మోటకొండూరు), పెబ్బా రామచందర్‌ (తిరుమల అండ్‌ విజయ పెట్రోలింగ్‌ బంక్‌, సిరిసిల్ల రోడ్‌, కామారెడ్డి), ముడుసు శివ, మేనేజర్‌ (సాయిగణేశ్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌, మేళ్ల చెరువు, సూర్యాపేట జిల్లా), మరిడి సుధీర్‌ (పరుశరామ్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌, కోదాడ, సూర్యాపేట జిల్లా), జమ్మిగుంపల పరమేశ్వరరావు, మేనేజర్‌ (గాయత్రి ఫ్యూయల్‌ పాయింట్‌, అల్లాదుర్గం, మెదక్‌ జిల్లా), దొడ్డిగొల్ల రంగారెడ్డి (తాజ్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌, కోటపల్లి మల్లేకల్‌, జోగులాంబ-గద్వాల జిల్లా).

పరారీలో ఉన్నవారు: కోదాడకు చెందిన మారం కృష్ణ, హైదరాబాద్‌ శివారులోని నాచారానికి చెందిన యడ్లపల్లి రమేశ్‌, జడ్చర్లకు చెందిన పేటిబండ్ల ప్రదీప్‌, వరంగల్‌కు చెందిన భిక్షపతి, ఏపీలోని ఒంగోలుకు చెందిన వెంకటేశ్వర్లు.2019 నుంచి మోసాలు..

పెట్రోల్‌ బంక్‌ల్లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రభుత్వం 2018 నుంచి అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. అయితే.. కొందరు కేటుగాళ్లు ఆ టెక్నాలజీని కూడా బురిడీకొట్టించే సాఫ్ట్‌వేర్‌ కనిపెట్టారు. ఈ క్రమంలో తయారైన ఇంటిగ్రేటెడ్‌ చిప్‌లను సుభాని బాషా బృందం ముంబై నుంచి దిగుమతి చేసుకుని 2019 నుంచి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ చిప్‌ల విలువ రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు సీజ్‌ చేసిన బంక్‌ల లావాదేవీల సామర్థ్యాన్ని బట్టి కోట్లాది రూపాయలు అక్రమంగా దండుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులను కస్టడీలోకి తీసుకుని, పూర్తి వివరాలు రాబడతామని, ముంబై నుంచి చిప్‌లను సరఫరా చేస్తున్న వారి కోసం గాలిస్తున్నట్లు సీపీ వెల్లడించారు.

"
"