ఆరు నెల‌ల్లోనే బాబు విలువేంటో జ‌నాల‌కు తెలిసిందా…!

రాజకీయాల్లో హుషారుగా ప్రసంగాలు చేయడం వేరు… పరిపాలనలో ధీమాగా ఉండటం వేరు. ప్రసంగాలు చేయగలిగిన వాళ్ళు అందరూ పరిపాలన చేస్తే… దేశం ఈ రోజు ఇంకో స్థాయిలో ఉండేది… తెలంగాణా ఎప్పుడో టాప్ లో ఉండేది. రాజకీయానికి అనుభవం అవసరం లేకపోయినా సరే పరిపాలనకు మాత్రం అనుభవం తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. ఒక్క అవకాశం అని ఇచ్చిన జనాలకు ఆరు నెలల్లోనే సినిమా మొత్తం అర్ధమైంది. అప్పులతో రాష్ట్రాన్ని ముందుకి నడిపిస్తున్నారు అనే విషయం జనాలకు ఒక స్పష్టత వచ్చింది.ఏపీలో పరిపాలన గురించి ఒకరకంగా జనం ఆలోచించడమే మానేశారు. సంక్షేమ పథకాల కోసం అప్పులు చేయడం చూసి నోరెళ్ళ బెట్టారు.

ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూసి ఇదేం ఖర్మ అనుకున్నారు. ఆదాయ వనరులు ఎక్కడ పెంచారు ఏం పెంచారు అనే ప్రశ్న కూడా ప్రజల నుంచి వినపడుతుంది. పోలవరం గురించి సమీక్షా సమావేశాలు ఎక్కడా అని ప్రజలు ఆలోచిస్తున్నారు. రాజధాని విషయంలో ఈ వైఖరి ఎందుకు అనే ప్రశ్న కూడా జనాన్ని ఆలోచనలో పడేసింది.అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఒక్క జగన్ ఇల్లు మినహా రాజధానిలో ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేద‌న్న అభిప్రాయ‌మే ప్ర‌జ‌ల్లో ఎక్కువుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. కనీసం జనం నడిచే రోడ్డుకి కూడా దిక్కు లేదు. ఇక భవిష్యత్తులో ఆదాయం భారీగా పడిపోయే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఆస్తులను చంద్రబాబు కాపాడితే జగన్ వచ్చి తెలంగాణకు అప్పగించారు అనే విషయం జనానికి అర్ధమైంది.రాజకీయం మినహా పరిపాలన ఎక్కడ కనపడట౦ లేదని, చంద్రబాబు ఉన్నప్పుడు రెండు వేర్వేరు గా ఉండేవని ఇప్పుడు కలిసిపోయాయని ప్రజలే అంటున్నారు. కేంద్రం నుంచి సాధించింది ఏ ఒక్కటి కూడా కనపడటం లేదు. అందుకే ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఆరు నెలల్లో ఇవన్ని చూసి చంద్రబాబు విలువ జనానికి అర్ధమైందని అంటున్నారు.

"
"