పవన్ కల్యాణ్ ని ఘోరంగా ట్రోల్ చేస్తున్న యాంటీ ఫ్యాన్స్…

టాలీవుడ్ సినీ పరిశ్రమలో మెగా కుటుంబం నుంచి హీరోగా పరిచయమై పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకొని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి, మళ్లీ సినిమాల్లో నటిస్తున్న హీరో “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ట్రోల్స్ మరియు మీమ్స్ తో కొంతమంది నెగిటివ్ ఫ్యాన్స్ తెగ హల్చల్ చేస్తున్నారు.అయితే ఇందులో ఇటీవలే పొరుగు దేశం అయినటువంటి రష్యా దేశం భారత దేశానికి కరోనా వైరస్ వ్యాక్సిన్ అందించడానికి ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.అంతేకాకుండా ఇందులో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ మొదటి కరోనా వైరస్ వ్యాక్సిన్ ని తన కూతురికి ఇచ్చాడు.

 

దీంతో పవన్ కళ్యాణ్ నెగిటివ్ అభిమానులు ఈ విషయంపై ట్రోల్స్ చేస్తూ భారతదేశానికి కరోనా వ్యాక్సిన్ ఇప్పించడంలో పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా ప్రమేయం ఎంతో ఉందని అంతేగాక ఈ విపత్తు ముందే ఊహించిన పవన్ కళ్యాణ్ అందుకే ముందుగా రష్యన్ యువతిని పెళ్లి చేసుకుని కరోనా వైరస్ వ్యాక్సిన్ భారతదేశానికి రప్పించాడని తెగ ట్రోల్స్ చేస్తున్నారు.దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ సమాజంలో పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి ఓ ప్రముఖ సెలబ్రెటీ మరియు రాజకీయ నాయకుడి పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాక ప్రపంచంలో ఇన్ని సమస్యలు ఉండగా కేవలం పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయంపైనే అందరూ ఎందుకు అంత ఆసక్తి చూపిస్తున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదని కొంత మంది అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న “వకీల్ సాబ్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

 

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ న్యాయం కోసం పోరాడే ఓ లాయర్ పాత్రలో కనిపించనున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.అయితే ఇప్పటికే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న కారణంగా కొంత కాలం పాటు చిత్రీకరణ పనులు వాయిదా వేయడంతో విడుదల కూడా వాయిదా పడింది.

"
"