ఎన్టీఆర్‌ కాషాయ దుస్తులు ధరించడానికి అగ్నివేశ్‌ కారణమా…?

హక్కుల ఉద్యమంలో భాగంగా స్వామి అగ్నివేశ్‌ ఒకసారి ఏపీకి వచ్చారు. అప్పుడు ఏపీ సీఎంగా ఉన్న ఎన్టీ రామారావు వద్దకు వెళ్లారు. కాషాయ వస్త్రాల్లో అగ్నివేశ్‌ను చూసి.. ‘మీరు సన్యాసం ఎందుకు తీసుకున్నారు?’ అని ఎన్టీయార్‌ అడిగారు. ‘సన్యాసిగా ఉంటే ఎలాంటి స్వార్థం ఉండదు. మన కోసం కాకుండా ఇతరులు, సమాజం కోసం పనిచేస్తాం. మీరూ నిజాయితీగా పనిచేయండి. సన్యాసం తీసుకోండి’ అని ఎన్టీయార్‌కు అగ్నివేశ్‌ సమాధానమిచ్చారు. అగ్నివేశ్‌ మాట ప్రభావమో లేక మరే ఇతర కారణమో.. ఎన్టీయార్‌ ఆ తర్వాతి కాలంలో కొన్నాళ్లపాటు కాషాయం ధరించారు.

"
"