ఎన్ని తిప్పలు పడ్డా కూడా అక్కడ నిమ్మలు ను టచ్ చెయలేకపోతున్నారు…

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ముఖ్యంగా ఇక్కడ బీసీ సామాజిక వర్గ నేతలే పార్టీకి కొండంత అండ. గతంలో ఇక్కడ కాంగ్రెస్ హవా ఉండేది. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ ఏర్పాటు చేశాక సీన్ మారిపోయింది. ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకూ ఒక్క 2009లోనే టీడీపీ ఓడిపోయింది. 2014లో తిరిగి టీడీపీ తరపున నిమ్మల రామానాయుడు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ రామానాయుడు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.రాష్ట్రమంతా ఫ్యాన్ హవా గట్టిగా వీస్తున్న సమయంలోనూ గట్టి పోటీ ఇచ్చారు. జగన్ సర్కార్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై వినూత్న రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. అటు అసెంబ్లీలోనూ ఇటు నియోజకవర్గంలోనూ మాటల తూటాలు పేల్చుతూ అధికార పార్టీకి పంటికింద రాయిలా మారారు. మరోవైపు నిత్యం ప్రజల్లోనే ఉండడానికి ఏదో కార్యక్రమం చేపడుతూనే ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండటం వల్ల అటు అధికారుల నుంచి ఇటు ప్రభుత్వం నుంచి సహాయనిరాకరణ ఎదురవుతున్నా ఏ మాత్రం నెరవకుండా ముందుకు సాగుతున్నారు. ఈ పరిణామాలు అధికార పార్టీ నాయకుల్లో దడ పుట్టించేవిగా మారాయి.

"
"