నరేంద్ర మోదీ సరికోత్త రికార్డ్…

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నాటికి సరికొత్త రికార్డును నెలకొల్పారు. అత్యధిక కాలం ప్రధాన మంత్రిగా సేవలందించిన నాలుగో వ్యక్తిగా రికార్డులోకెక్కారు. ఇంతకు పూర్వం కాంగ్రెస్ వ్యక్తులు ఈ రికార్డులో ఉన్నారు. మోదీ తర్వాత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయ్ ఆ స్థానంలో ఉన్నారు. వాజ్‌పాయ్ 2268 రోజులు ప్రధానిగా దేశానికి సేవలందించారు.ఈ పదవీ కాలాన్ని కూడా మోదీ దాటిపోయారు.అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన వారిలో నెహ్రూ, ఇందిర, మన్మోహన్ ఉండేవారు. కాంగ్రేసేతర ప్రధానిగా అత్యధిక కాలం సేవలందించిన ఘనత మోదీ సొంతం చేసుకున్నారు.

 

14 వ ప్రధానిగా మోదీ మే 26, 2014 న ప్రమాణ స్వీకారం చేశారు. తిరిగి రెండోసారి ప్రధానిగా మే 30, 2019 న ప్రమాణ స్వీకారం చేశారు.ఇక… రెండో రికార్డును కూడా ప్రధాని మోదీ సొంతం చేసుకున్నారు. ఆగస్టు 15 నాడు ప్రధాని హోదాలో ఎర్ర కోట నుంచి జాతీయ జెండా ఎగురవేసే విషయంలో మోదీ రికార్డు నెలకొల్పారు. అత్యధిక సార్లు ఎర్రకోట నుంచి జాతీయ జెండా ఎగుర వేసిన ప్రధానుల జాబితాలో మోదీ నాలుగో స్థానం. ప్రధానిగా నెహ్రూ 17 సంవత్సరాలు బాధ్యతల్లో ఉండగా… ఇందిరా గాంధీ 11 సంవత్సరాలు.. మన్మోహన్ పది సంవత్సరాలు ప్రధానిగా బాధ్యతల్లో ఉన్నారు.

"
"