చిన్న‌బాబుకు చ‌క్క‌ని ఛాన్స్‌.. వాడుకుంటే.. తిరుగులేదుగా..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుమారుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు ఇప్పుడు చ‌క్క‌ని అవ‌కా శం చిక్కింద‌ని అంటున్నారు పార్టీలోని సీనియ‌ర్ నాయ‌కులు.త‌న‌ను తాను నిరూపించుకుని పార్టీలో త‌న స‌త్తా చాటుకునేందుకు ఆయ‌న‌కు మంచి అవ‌కాశం వ‌చ్చింద‌ని చెబుతున్నారు. నిన్న మొన్న‌టివ‌ర‌కు ఆయ‌న నాయ‌క‌త్వంపై ర‌క‌ర‌కాల సందేహాలు వ‌స్తున్నాయి. కృష్ణాజిల్లా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ స‌హాప‌లువురు నాయ‌కులు లోకేష్ నాయ‌క‌త్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న ఘోర ప‌రాజ‌యం కావ‌డం, పార్టీ అధికారంలోకి రాక‌పోవ‌డం వంటి ప‌రిణామాలు లోకేష్‌కు మాయ‌ని మ‌చ్చ‌గా మారాయి.

పైగా ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో లోకేష్ ఉత్త‌రాంధ్ర జిల్లాల బాధ్య‌త‌ను త‌న భుజానే వేసుకున్నారు. ఇక్క‌డ టికెట్ల కేటాయింపు నుంచి ప్ర‌చారం వ‌ర‌కు కూడా ఆయ‌నే చూసుకున్నారు. ఇక‌, కీల‌క‌మైన మంగళ గిరి ని యోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. అయితే, ఆయ‌న ప్ర‌చారం చేసిన ఉత్త‌రాంధ్ర జిల్లాలు స‌హా మంగళగిరి లోనూ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఈ ప‌రిస్థితిలో స‌హ‌జంగానే లోకేష్ పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.ఇదిలా వుంటే, పార్టీలో కార్యాచ‌ర‌ణ అధ్య‌క్ష‌డు అనే ప‌ద‌విని సృష్టించి, దానికి లోకేష్‌ను ప్ర‌మోట్ చేయ‌ను న్నార‌నే ప్ర‌చారం కూడా జోరుగాసాగింది. దీనికిత‌గిన‌ట్టుగా నే బాబు కూడా దీనికి సంబంధించిన క‌స‌రత్తు ను ముమ్మ రం చేశారు. ఈ క్ర‌మంలోనే తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. లోకేష్ అస‌లు ప్ర‌జానాయ‌కుడే కాద‌ని, బ‌ల‌వంతంగా ప్ర‌జ‌ల‌పై రుద్దుతున్నార‌ని వంశీ వంటివారు బాహాటంగానే ఆరోపించారు. ఈ క్ర‌మంలో లోకేష్ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డా రు. అయితే, ఇప్పుడు ఆయ‌న‌కు చ‌క్క‌ని అవ‌కాశం వ‌చ్చింద‌ని, త‌న‌ను తాను నిరూపించుకుని, నాయ‌కు డిగా ఎదిగేందుకు ఛాన్స్ వ‌చ్చింద‌ని అంటున్నారు సీనియ‌ర్లు.

దీనికి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను తెర‌మీ దికి తెస్తున్నారు. వ‌చ్చే జ‌న‌వ‌రిలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం స‌మా యత్తం అయింది. ఈ క్ర‌మంలో ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ స‌త్తా చాటేందుకు చిన్న‌బాబు ముందుకు రావాల‌ని వారు సూచిస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో మెజారిటీ జిల్లాల్లో పార్టీ పుంజుకుంటే, లోకేష్ నాయ‌క‌త్వ ప‌టిమ‌పై న‌మ్మ‌కం వ‌స్తుంద‌ని అంటున్నారు. మ‌రి చిన్న‌బాబు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

"
"