మోడీ-షాలకు శని…..జగన్ రూపంలో

తిరుగులేని మోడీ-షాల ద్వ‌యానికి జ‌గ‌న్ ఏలిన‌నాటి శ‌ని అంటుకుంది. ఏ స‌మీక‌ర‌ణంలోనూ త‌మ‌తో క‌ల‌వ‌ని జ‌గ‌న్‌ని కేవ‌లం చంద్ర‌బాబును దెబ్బ‌కొట్టాల‌ని మోడీ-షాలు చేర‌దీశారు. ఎన్నిక‌ల్లో అన్నివిధాలా సాయం చేశారు. కేసుల్నించి త‌ప్పించ‌డం జ‌గ‌న్‌కి అవ‌స‌రం అయితే, జాతీయంగా త‌మ‌కు ఎప్ప‌టికైనా పోటీ వ‌చ్చే టీడీపీని దెబ్బ‌కొట్టే ల‌క్ష్యం మోడీది. అంత‌కుత‌ప్పించి జ‌గ‌న్‌-మోడీల ర‌హ‌స్య‌పొత్తుకు ఎటువంటి కార‌ణాలు లేవు. అయితే ఇటీవ‌లే జాత‌కం ప్ర‌కారం జ‌గ‌న్‌కి ప‌ట్టిన అష్ట‌మ‌శ‌ని ఎంట‌రైంది. దీనివ‌ల్ల కోర్టుల్లో చుక్కెదురు, పాల‌న‌లో వైఫ‌ల్యం, జాతీయంగా బ‌ద్నాం కావ‌డం, అంత‌ర్జాతీయ సంస్థ అయిన కియా వ్య‌వ‌హారాంతో త‌ల‌నొప్పి జ‌గ‌న్‌కి చుట్టుకున్నాయి. జ‌గ‌న్ ఒక్క‌డికే కాకుండా ఆయ‌న‌తో ర‌హ‌స్య స్నేహం చేస్తున్న మోడీకి కూడా ఢిల్లీ ఫ‌లితాల రూపంలో అష్ట‌మ‌శ‌ని చుట్టుకుంది.

 

అందుకే ఢిల్లీ ఎన్నిక‌ల్లో క‌మ‌ల‌నాథుల అంచ‌నాలు త‌ల్ల‌కిందుల‌య్యాయి.కేంద్ర‌మంత్రులంద‌రినీ మొహ‌రించినా, ఓటుకు 5 వేలు ఇచ్చి కొన్నా..ఎన్ని చేసినా క‌మ‌ల‌నాథులు ఆప్ అప్ర‌తిహ‌త విజ‌యాన్ని ఆప‌లేక‌పోయారు. ఇది కేవ‌లం జ‌గ‌న్‌ని ప‌ట్టి పీడిస్తున్న శ‌ని ప్ర‌భావం, ఆయ‌న‌తో ఉండ‌టం వ‌ల్ల మోడీకి చుట్టుకోవ‌డ‌మేనంటున్నారు జ్యోతిష్య‌పండితులు.ప్ర‌ఖ్యాత జ్యోతిష్యులు చెప్పిన మేర‌కు ఒక వ్యక్తి జన్మరాశి చక్రంలో చంద్రుడికి ముందు, పన్నెండో ఇంట, లగ్నంలో చంద్రుడితో, చంద్రుడికి తరువాత రెండో ఇంట శని ఉంటే ఆ వ్యక్తికి ఏలిననాటి శని ఆరంభమైనట్టే లెక్క. యిది జ‌గ‌న్ జాత‌కానికి స‌రిగ్గా స‌రిపోయే లెక్క‌. శని ప్రభావం రెండున్నర సంవత్సరాల వంతున మూడుసార్లు, మొత్తం ఏడున్నర సంవత్సరాల కాలం ఉంటుంది. 2020 జ‌న‌వ‌రి 23 నుంచి జ‌గ‌న్ జాత‌క‌రీత్యా అష్టమి శని ప్రారంభం అయ్యింది. అష్టమశని ప్ర‌భావంతో జ‌గ‌న్ చుట్టూ క‌ష్టాలు అలుముకుంటున్నాయి.

 

లగ్నంలో కుజుడు ఉన్నాడని, అష్టమస్థానంలో శని ఉన్నాడని అది ఎంతమాత్రము మంచిది కాదని జ్యోతిష్యులు ఘోషిస్తున్నా జ‌గ‌న్ ప‌ట్టించుకోకుండా విశాఖ స్వ‌రూపానంద మాయ‌లో ప‌డి..రాజ‌ధాని ఒక్క‌టి మారిస్తే జాత‌కం మారిపోద్ద‌నే మాట న‌మ్ముతున్నార‌ని..దీని ప‌ర్య‌వ‌సానంగానే కోర్టు కేసుల‌న్నింటిలోనూ జ‌గ‌న్‌కి వ్య‌క్తిగ‌తంగానూ, ప్ర‌భుత్వ ప‌రంగానూ ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయ‌ని వారు అష్ట‌మ‌శ‌ని ప్ర‌భావాన్ని విశ్లేషించారు.

"
"