మరోకసారి ఎంటరైన రఘురామరాజు

వైసీపీ అధిష్ఠానానికి కొరకరాని కొయ్యగా మారిన నర్సాపురం ఎంపీ రఘురామరాజు.. పార్టీకి రాజీనామాపై తన మనసులోని మాట బయటపెట్టారు. రాజీనామా చేయనుగాక చేయనని తేల్చి చెప్పారు. పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘ఫలానా ఎక్స్ బొమ్మ పెట్టుకుని గెలిచానన్నారు. నా ముఖంతోనే నేను గెలిచాను. నా ముఖం చూసే బటన్ నొక్కారు. అది ప్రజలకు తెలుసు. నా రక్తం పీల్చేసిన ఎమ్మెల్యేలకు తెలుసు.

 

అమరావతే రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా చెప్పి.. వెనకడుగు వేశారు. ప్రజలకు వ్యతిరేకంగా వెళ్లారు కాబట్టి మీరే మూకుమ్మడిగా రాజీనామా చేయాలి. నా ముఖం అక్కడే ఉంది. మళ్లీ మళ్లీ చెబుతున్నాను.. నేను నెగ్గాను. అమరావతిపై మీరు మాట తప్పారు కాబట్టి, ప్రభుత్వంగా, అప్పటి ప్రతిపక్ష పార్టీగా ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేదు కాబట్టి, రాజీనామా అంటూ చేస్తే మీరు, మీ మంత్రివర్గం చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప.. నేను చేయాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ సాక్షిగా చెబుతున్నాను. నేను పార్టీకి విధేయుణ్ణి.. పార్టీ ఆనాడు చెప్పిన మాటను గుర్తు చేస్తున్నాను. ఇచ్చిన మాట తప్పారు కాబట్టి.. మీరు చేసుకోండి. నేను రాజీనామా చేయను’’ అని చెప్పారు.

"
"