మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన తెలంగాణా స్పీకర్.

తెలంగాణ అసెంబ్లీలో మంత్రులకు స్పీకర్ పోచారం చురకలు అంటించారు. సభలో మంత్రులు ఈటల రాజేందర్‌, జగదీశ్‌రెడ్డి కోవిడ్ రూల్స్ పాటించకుండా పక్కపక్కనే కూర్చున్నారు. సభా సమయంలో ఈటల పక్క సీట్లో ఉన్న నో-సీటింగ్ చైర్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి కూర్చున్నారు. మంత్రులను గమనించిన స్పీకర్.. నో-సీటింగ్ సీట్‌లో కూర్చోవద్దని సూచించారు. స్పీకర్ హెచ్చరికతో వెంటనే ఈటల దగ్గర నుంచి జగదీశ్‌రెడ్డి వెళ్లిపోయారు. సభలో సభ్యులందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉంటే.. అసెంబ్లీలో మంత్రి నిరంజన్ రెడ్డి స్పీచ్‌కు సహచర మంత్రులు ఈటల, ఎర్రబెల్లి అడ్డుపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో పామాయిల్ సమాధానం కోసం మంత్రి నిరంజన్ రెడ్డి సుదీర్ఘ సమయాన్ని తీసుకుని మాట్లాడారు. దీంతో స్పీకర్‌కు మంత్రులు ఈటల, ఎర్రబెల్లి సమయాన్ని గుర్తుచేశారు. ఒక్క ప్రశ్నకు ఎంత సమయం తీసుకుంటారని ప్రశ్నించారు. సహచర మంత్రులు అడ్డుచెప్పడంతో మంత్రి నిరంజన్ రెడ్డి వెంటనే స్పీచ్ ముగించారు.

"
"