మంత్రి అనిల్ పై తిరుగుబాటు.. సొంత పార్టీలోనే చుక్కలు చూపిస్తున్న పెద్దారెడ్లు

నెల్లురు జిల్లాలో ఏం జరుగుతుంది అని అందరు అనుకుంటున్నారు. వైసీపీ లో సినియర్ల పట్ల మంత్రి అనిల్ కూమార్ యాదవ్ ప్రవర్థించే తిరు ఏం అంత బాగాలేదని అందరు అనుకుంటున్నారు. అసలు  ప్రస్తుతం జరుగుతున్న తీరు చూస్తుంటే  అందరికి అదే అనుమానాలు వస్తున్నాయి. అసలు అతడిపై ప్రస్తుతం ఏం అనుకుంటున్నారు అని అందరు అనుకుంటున్నారు. అదికాక వైఎస్ జగన్ ఇచ్చిన కీలక మైన శాఖ అయిన ఇరిగెషన్ పనులను ఏలా నిర్వర్తిస్తున్నారని అందరు అనుకుంటున్నారు.ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పనితీరుపై సొంత జిల్లా ప్రజలు ఏమంటున్నారు? ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలకి ఎమ్మెల్యేలు ఎందుకు హాజరుకావడం లేదు? నెల్లూరు పెద్దారెడ్లు మంత్రి అనిల్‌కి దూరంగా ఎందుకుంటున్నారు? నగరంలో పెత్తనం చెలాయిస్తోంది ఎవరు? నీటి తరలింపు విషయంలో మంత్రి చేసిన పెద్ద తప్పిదమేంటి? పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం.”అక్కరకురాని చుట్ట మెందుకు?” అన్నట్టుగా ఉంది నెల్లూరు జిల్లాలో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ వ్యవహారశైలిపై జరుగుతున్న చర్చ. నెల్లూరుకి చెందిన డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్తగా రాజకీయ అరంగేట్రం చేసి అంచెలంచెలుగా ఎదిగారు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ అనిల్‌కుమార్ యాదవ్ రాజకీయాల కోసం సొంత ఆస్తులు పోగొట్టుకున్నారనే సానుభూతి ప్రజల్లో ఉండేది.

అంతకుముందు, గత ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు నెల్లూరు సిటీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి నారాయణకు గట్టిపోటీ ఇచ్చారు. రెండు వేల లోపు ఓట్లతో గట్టెక్కారు. మొదటి నుంచి అనిల్ కుమార్.. వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రుడిలా మెలుగుతూ వచ్చారు. అందుకే వైసీపీ అధికారంలోకి రాగానే సీఎం జగన్.. ఆయనకు కీలకమైన నీటిపారుదలశాఖ మంత్రి పదవి కట్టబెట్టారు. నెల్లూరు జిల్లా ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడింది. అనిల్ కి మంత్రి పదవి రాగానే చాలా మంది ఆనందపడ్డారు. జిల్లాకు పెద్ద మేళ్లు జరుగుతాయని కలలుగన్నారు. జిల్లాలో చాలా మంది సీనియర్ నేతలున్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన యోధానుయోధులు ఉన్నారు. అంతేకాదు వైసీపీ అధికారంలోకి రావాలని, జగన్ ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో ముఖ్యనేతలు, ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు అలుపెరగక పనిచేశారు. అయితే అనిల్ కి మంత్రి పదవి ఇచ్చే సమయంలో జగన్ కనీసం మాటమాత్రం కూడా ఎవరితో చర్చించలేదనే ఫీలింగ్ చాలా మంది సీనియర్ నేతలలో ఉంది.ఇదిలావుంటే మంత్రి పదవితో జిల్లాలోకి ఎంటరైన అనిల్ కుమార్ యాదవ్ నేరుగా సీనియర్ నేతలని కలిసి.. తనకు సహకారం అందివ్వాలని కోరారు. “అనిల్ మంచివాడే.. సరే సహకరిద్దాం.. జిల్లా అభివృద్ది ముఖ్యం కదా..” అని సీనియర్లు అనుకున్నారట. అయితే ఆ మర్యాదలు, గౌరవాలు వారికి ఎక్కువ రోజులు కొనసాగలేదట. ఈ పరిణామం వారిని బాగా ఫీల్ అయ్యేలా చేసింది. ఇందుకు కారణమేమిటంటే.. నెల్లూరు జిల్లాలో గత కొన్నేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ప్రజలని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఎన్నడూ లేనంతగా కరవు విలయ తాండవం చేసింది. కనిగిరి, సర్వేపల్లి వంటి రిజర్వాయర్లు సైతం చుక్కనీరు లేక వెలవెలబోయాయి. సోమశిల డ్యాంలో నీటి నిల్వ రెండు టీఎంసీలకే పరిమితమైంది. వర్షాలు రాకుంటే ఈ ఏడాది తాగేందుకు, పశువులకు నీరుండదని అందరూ దిగులు పడ్డారు. అదే సమయంలో గోదావరి, కృష్ణా నదులకు ఎగువ నుంచి భారీగా వరదనీరు వచ్చింది. అందరూ హమ్మయ్య ఇక దిగులు లేదనుకున్నారు. గతేడాది తీవ్ర నీటిఎద్దడి ఉన్న సమయంలోనే టీడీపీ ప్రభుత్వం సోమశిల జలాశయానికి 48 టీఎంసీల నీటిని తెచ్చి అవసరాలు తీర్చింది. “అప్పుడు అందరం పంటలు పండించుకున్నాం.. అలాంటిది ఇప్పుడు అంతకుమించి నీరు జిల్లాకు వస్తుందనీ, కాబట్టి సోమశిల, కండలేరుతోపాటు చెరువులన్నీ నింపేస్తారనీ అందరూ ఆశించారు.ఓ వైపు పెద్దఎత్తున వరదనీరు శ్రీశైలం డ్యాం దాటి దిగువకి వెళ్తున్నా.. జిల్లా అవసరాల గురించి ఆలోచించే వారే లేరు. అంతెందుకు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి ముఖ్య నేతలకు నీటి అవసరాలు, తరలింపు విషయంపై బాగా అవగాహన ఉంది.

గతంలో ఆనం మంత్రిగా, కాకాణి జెడ్పీ ఛైర్మన్ గా ఉన్నప్పుడు ఎదురైన తీవ్ర నీటిఎద్దడిని వారు సమయస్ఫూర్తిగా ఎదుర్కొన్నారు. అప్పుడు అన్ని పార్టీల నేతలతో చర్చించి నిర్ణయాలు తీసుకుని మరీ జిల్లాలో నీటి అవసరాలు తీర్చారు. కానీ ఇప్పుడు కనీసం వైసీపీలో ముఖ్యుల అభిప్రాయాలు కూడా తీసుకోలేదట. కృష్ణానదిలో ఎగువ నుంచి పెద్దఎత్తున వరదనీరు వస్తుంటే.. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తివేసి కిందకు నీటిని వదిలారు. అంతేకానీ 40 వేల క్యూసెక్కులపైగా నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి సోమశిలకు తరలించే విషయాన్ని మాత్రం పక్కన పెట్టారు. సోమశిలకు సరిగ్గా 35 టీఎంసీల నీటిని తరలించలేకపోయారు. ఈ సయమంలో జిల్లా ముఖ్యనేతలు, సీనియర్ల అభిప్రాయాలు తీసుకుని ఫాలో అయివుంటే.. జిల్లాలో నీటి సమస్యే ఉండేది కాదని రాజకీయ విశ్లేషకులు, రైతు సంఘాల నాయకులు అంటున్నారు.ప్రస్తుతం వరదలకు సోమశిల జలాశయం నిండింది. అయితే ఆ నీరు పూర్తి స్థాయిలో సరిపోయే పరిస్థితులు లేవు. చివరకు కావలి కాలువ కింది రైతులు సైతం నార్లు పోయడానికి వెనుకడుగు వేస్తున్నారు. అయితే శ్రీశైలం డ్యామ్ కు వరద నీరు పోటెత్తిన సమయంలోనే కిందకుపోయే నీటిని తరలించకపోవడంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలకంగా వ్యవహరించలేదనీ, అసలు ఆ నీటి తరలింపుపై ఆయనకు విషయ పరిజ్ఞానం లేదనీ కొందరు విమర్శిస్తున్నారు. ఇదే అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అయ్యాక.. ఆయన చేసిన పెద్ద తప్పిదమని చర్చించుకుంటున్నారు.నెల్లూరు జిల్లాలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యవహారశైలిపై స్వపక్షంలోని చాలా మంది సీనియర్ నేతలకు, మరీ ముఖ్యంగా నెల్లూరు పెద్దారెడ్లకి అసలు నచ్చడం లేదట. సిటీ, రూరల్ నియోజకవర్గాల పెత్తనమంతా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆయన అప్పగించేశారట. ఆనం, కాకాణి లాంటి వారిని సైతం వారి నియోజకవర్గాలకే పరిమితం చేశారని పలువురు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేతలు ఏదైనా పనిమీద వెళ్లినా.. వారిని అనిల్ అంతగా పట్టించుకోవడం లేదట. “నాకే మంత్రి పదవి వచ్చింది” అన్నట్టుగా ఆయన తీరు ఉందట. చాలా మందికి అవమానాలు కూడా ఎదురయ్యాయట. దీంతో నెల్లూరు పెద్దారెడ్లు చాలామంది అనిల్ దగ్గరకు వెళ్లడమే లేదని సమాచారం. ఇటీవల కస్తూర్బా కళాక్షేత్రంలో సచివాలయ ఉద్యోగాలు పొందినవారికి నియామక పత్రాల జారీ కార్యక్రమం జరిగింది. ఇందులో ఒక్క సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మినహా మిగిలిన వారెవ్వరూ పాల్గొనలేదు. మనస్సులు నొచ్చుకునేలా మంత్రి తీరు ఉండటమే అందుకు కారణమనే చర్చ జోరుగా సాగుతోంది.

నెల్లూరు నగరంలో గతంలోనూ అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా చాలానే హామీలిచ్చారు. అయితే ఇప్పటికీ ఆ హామీల ఊసే లేదు. “ఆయన మంత్రి అయ్యి ఏం సుఖం.. ఏదైనా చేస్తే కదా?” అని నగరవాసులు అసంతృప్తితో కూడిన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక జిల్లావ్యాప్తంగా కూడా ఇదే చర్చ సాగుతోంది. “ఆయనేం మంత్రయ్యా.. మా పల్లెల్లోకి వస్తే కదా మా బాధలు తెలిసేది” అని పలువురు గ్రామస్థులు అంటున్నారు. ఇలా అనిల్ మంత్రి అయ్యారనే ఆనందం.. ఆయన వెనుక తిరిగే నలుగురైదుగురికి మించి మరెవ్వరిలోనూ కనిపించడం లేదట. ఇప్పటికైనా సీనియర్లకి కనీస గౌరవం ఇచ్చి, అందరి అభిప్రాయాలతో ముందుకు వెళితే రాజకీయంగా ఆయనకు, ప్రజలకు మేలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మరి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీరు మార్చుకుంటారా? నెల్లూరు జిల్లా, నగరవాసులకు మేలు కలిగే రీతిలో వ్యవహరిస్తారా? అనేది చూడాలి.

"
"