మమత బెనర్జీ మరో ప్రకటన…షాక్ లో పశ్చిమ బెంగాల్

మే నాలుగు తర్వాత మొత్తం లాక్‌డౌన్ ఎత్తేయడం వైపే తాను మొగ్గు చూపుతానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అయితే అది మూడు దశల్లో చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ‘‘మే నాలుగు తర్వాత లాక్‌డౌన్ ఎత్తేయాలన్నదే ఓ పౌరురాలిగా, టీఎంసీ చీఫ్‌గా నా అభిప్రాయం. అయితే అది మూడు దశల్లో అయితే బాగుంటుంది’’ అని తెలిపారు.

 

మే నాలుగు తర్వాత మొదటి వారం రోజుల పాటు 25 శాతం, ఆ తర్వాత వచ్చే రెండో వారంలో 50 శాతం, ఆ తర్వాతి రెండు వారాల్లో వంద శాతం ఎత్తేస్తే బాగుటుంది అని సూచించారు. అయితే వీటికీ కొన్ని మినహాయింపులుండాలని కోరారు. విమానాలు, రైళ్ల రాకపోకలపై నిషేధం ఇలాగే కొనసాగాలని, ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లపై నిషేధం కొనసాగిస్తేనే మంచిదన్నారు. అయితే హాట్‌స్పాట్‌లలో మాత్రం ప్రభుత్వ జోక్యాలు కొనసాగాల్సిందేనని మమతా స్పష్టం చేశారు.

"
"