ఢిల్లీలోనే ఎల్వీ…జ‌గ‌న్ గుట్టు మొత్తం విప్పేస్తున్నారా…!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సంచలనంగా మారిన విషయాలలో సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం ని బదిలీ చేయడం ఒక‌టి. ఎన్నిక‌ల‌కు ముందు నుంచి బాబుకు యాంటీగా జ‌గ‌న్‌కు పాజిటివ్‌గా ఉంటూ వ‌చ్చిన ఆయన్ను ఎందుకు బదిలి చేసారు ? అనే దానిపై అప్పటి నుంచి ఎవరికి ఏ స్పష్టత రాలేదు. తిరుమల విషయంలో వివాదంలోనే ఆయన్ను బదిలి చేసారని, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి… ఎన్నికల అఫిడవిట్ గొడవ అని… ఇక జగన్ ని ఆయన లెక్క చేయడం లేదని, చంద్రబాబుకి సహకరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఎక్కువగా వినపడట౦ ఒక కారణమని, అందుకే జగన్ ని బదిలీ చేసారనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపించాయి.ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యంను వెలగపూడి నుంచి డైరెక్ట్ గా బాపట్ల బదిలి చేసారు.

పాపం అలిగిన ఎల్వీ సెలవులో వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆయన ఢిల్లీలోనే ఉంటున్నారు అనే ప్రచారం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి వెళ్తారని, విజిలెన్స్ కమిషనర్ గా బాధ్యతలు చేపడతారని… ప్రచారం జరిగింది. అవి ఎంత వరకు నిజమో తెలియదు గాని రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి విషయంలో ఆయన్ను అడిగి కొంత సమాచారం కేంద్రం సేకరిస్తుంద‌న్న చ‌ర్చ‌లు వైసీపీ వ‌ర్గాల్లోనే వినిపిస్తున్నాయి.ఆయన ద్వారా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఏ విధంగా సమకూరుస్తున్నారు… అప్పుల పరిస్థితి ఏంటి…? ప్రభుత్వంలో కీలక వ్యక్తులు ఎవరు…? రివర్స్ టెండరింగ్ అనే విధానం తీసుకురావడానికి పైకి కనపడని కారణాలు ఏంటి…? ఇలాంటి అన్ని విషయాలను ఆయన నుంచి సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక అధికారుల విషయంలో తీసుకున్న నిర్ణయాలు ? ఆయ‌న బదిలీకి ప్రభావితం చేసిన కారణాలు ఏంటి…? ఎవరికి ఎక్కువ ప్రభుత్వం తరుపున లబ్ది చేకూరుస్తున్నారు అనే ప్రతీ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట కేంద్ర పెద్దలు.

"
"