యూపీ ప్రభుత్వం షాకింగ్ డేసిషన్…లాక్ డౌన్ పోడిగింపు…

కరోనా మహమ్మారి తీవ్రత తగ్గకపోవడంతో పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మే 3 వరకూ కొనసాగిస్తూనే మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 30 వరకూ జనాలు గుమిగూడవద్దని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించమని ఆయన తేల్చి చెప్పారు.

 

కేంద్ర ప్రభుత్వం ముందే ప్రకటించినట్లు మే 3 వరకూ లాక్‌డౌన్ అమలులో ఉంటుందన్న విషయం తెలిసిందే. ఒకవేళ దేశంలో కరోనా కేసులు తగ్గి, కేంద్రం మే 3 తర్వాత లాక్‌డౌన్‌ను ఎత్తేస్తే వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు యూపీకి అధిక సంఖ్యలో వచ్చే అవకాశముందని అధికారులు ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. అదే జరిగితే కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసిరే అవకాశాలు ఉండటంతో యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

"
"