కెంద్రం అనుకుంటే అమరావతి చాలా చిన్న విషయం… టీడీపీ ఎమ్మెల్యె సంచలనం..

రాష్ట్రంలో కోద్ది రోజులుగా  అమరావతి విషయంలో ఏలాంటి పరీస్థీతులు ఏదుర్కుంటుందో అందరికి తేలిసిన విషయమే. దినిపై రాష్ట్రంలోని ప్రజలంతా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. బీజేపీకి అమరావతి సమస్య చాలా చిన్న విషయమని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. కశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపిన కేంద్రానికి అమరావతి చిన్న విషయమేనని ఆయన వ్యాఖ్యానించారు.

 

జనసేన, బీజేపీ కలయిక కీలక పరిణామమని అభిప్రాయపడ్డ పయ్యావుల కేశవ్… అమరావతిపై కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని డిమాండ్ చేశారు. రాజధాని కోసం బీజేపీ, జనసేన కలిసి ఏం చేయబోతున్నాయో అని అంతా ఎదురుచూస్తున్నారని పయ్యావుల కేశవ్ అన్నారు. రాజధాని అంశంపైనే బీజేపీ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాజధాని తరలింపునకు కేంద్రం ఆమోదం తెలిపిందా అనే అనుమానం కలుగుతోందని పయ్యావుల కేశవ్‌ వ్యాఖ్యానించారు. ఏపీలో బీజేపీ, జనసేన కలయిక వల్ల పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు ఊహించలేని… కొత్త పొత్తుల శక్తి ఏంటో భవిష్యత్‌లో తెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

"
"