హుకుం జారీ చెసిన కెసీఆర్…మొత్తం మార్చాలి..

‘గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది. అయినా గ్రామాల్లో మార్పు రాకపోతే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎవరి బాధ్యతలు వారు నెరవేర్చేలా పనిచేయించే బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాల్సిందే’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తాను కూడా ఆకస్మిక పర్యటనలు చేస్తానని, ఏ గ్రామం అనుకున్న విధంగా లేకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను అమలు చేయడమే జిల్లా యంత్రాంగం బాధ్యత. అంతే తప్ప.. ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండరాదు.విస్తృత మేధోమథనం, అసెంబ్లీలో విస్తృత చర్చ, విషయ నిపుణులతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం వాస్తవిక దృష్టితో చట్టాలు తెచ్చింది.

 

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే అధికార యంత్రాంగం అమలు చే యాలి’ అని కేసీఆర్‌ అన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సీఎం సమావేశమయ్యారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తోపాటు కీలక అధికారులు హాజరయ్యారు. ఉదయ 11 నుంచి రాత్రి 10 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రాథమ్యాలు, బాధ్యతలను ముఖ్యమంత్రి వివరించారు.గ్రామాల అభివృద్ధికి అన్ని చర్యలూ తీసుకున్నాం. కొత్తగా జిల్లాలు, డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటు ద్వారా పరిపాలనా విభాగాలు చిన్నవయ్యాయి. ఇది పల్లెలను బాగు చేసుకోవడానికి సానుకూల అంశం. పల్లెల అభివృద్ధికి నెలకు రూ.339 కోట్ల ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తు న్నాం. అన్ని గ్రామాలకు గ్రామ కార్యదర్శులను నియమించాం. ఎంపీవోలు, ఎంపీడీవోలు, డీఎల్‌పీవో, డీపీవో, జడ్పీ సీఈవో పోస్టులన్నింటినీ భర్తీ చేశాం. పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచాం. గ్రామాల్లో ట్రాక్టర్లను సమకూర్చుకునే అవకాశం కల్పిం చాం. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చాం.

"
"