కేసీఆర్‌ను క‌లిసేందుకు మోడీ ఇష్ట‌పడ‌డం లేదా..!

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహంగా ఉన్నారా…? అంటే అవుననే సమాధానమే ఢిల్లీ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో స్నేహం నుంచి రాష్ట్రంలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కేంద్రానికి ఆగ్రహం తెప్పిస్తున్నాయి అనే ప్రచారం కొంత కాలంగా జరుగుతుంది. బిజెపి నేతల విషయంలో రాష్ట్రంలో అధికారులు అనుసరిస్తున్న వైఖరి… సచివాలయం కట్టడం, గోదావరి జలాల విషయంలో కెసిఆర్ వైఖరి వంటివి కేంద్రానికి చికాకు తెప్పించాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.

ఇక రాష్ట్రంలో బిజెపి బలపడాలని చూస్తున్న క్రమంలో… భావోద్వేగాలను కనపడకుండా కెసిఆర్ రెచ్చగొడుతున్నారు అని బిజెపి భావిస్తుంది. ఇప్పుడు ఇవే ప్రధానికి కెసిఆర్ ని దూరం చేశాయని అంటున్నారు. వాస్తవానికి ఆర్టీసి సమ్మె సమయంలో కెసిఆర్ ఢిల్లీ వెళ్ళాలి అని భావించారు. కాని ప్రధానిని కలవడానికి అవకాశం దొరకలేదు. ఆ తర్వాత అమిత్ షా తో భేటి అవ్వాలని కెసిఆర్ భావించారు. అయినా సరే అవకాశం దొరకలేదు. గత వారం కూడా ఆయన ప్రధానిని కలవడానికి ప్రయత్నాలు చేసారు అయినా సరే ఫలితం లేదు.ఇక ఈ నెల మూడో వారంలో ప్రధానిని కలవాలని, విభజన హామీలపై ప్రధానికి ఒక లేఖ రాసి అందించాలని కెసిఆర్ భావిస్తున్నారు.అయినా సరే కలుస్తారా లేదా అనేది అనుమానంగా మారింది. రాజకీయంగా బిజెపికి, తెరాసకి దూరం జరిగిందని అంటున్నారు.

బిజేపి ఏదైనా తేడా చేస్తే… దేశంలో ఉన్న విపక్షాలను కూడా ఏకం చెయ్యాలి అని భావిస్తున్నారు కెసిఆర్. శివసేన ఎంపీలను కొందరు తెరాస ఎంపీలు కలిసారు అంటున్నారు. ఇవన్ని కూడా బిజెపి ఆగ్రహానికి కారణంగా మారాయని… హైదరాబాద్ విషయంలో కేంద్రం దూకుడుగా వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు.

"
"