జోరందుకోనున్న మున్సిపల్ ఏన్నికలు…టీఆర్ఎస్ ఎమ్మెల్యె సవాల్

తెలంగాణాలో మున్సిపల్ ఏన్నికలు కోన్ని రోజులలో వుండటంతో అందరు రేడీ అవుతున్నారు.నిజామాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి మేయర్ కాకుండా ఎంఐఎంకు మేయర్ సీట్ ఇస్తే ప్రెస్ క్లబ్ నుంచి కంఠశ్వర్ గుడి వరకు ముక్కు నెలకు రాస్తానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా వ్యాఖ్యానించారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు ఆయన కౌంటర్ ఇచ్చారు. అరవింద్‌లా బాండ్ పేపర్లు రాసి మాట మార్చే అవసరం తమకు లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తాము చేసిన పనులను బీజేపీ మేనిఫెస్టోలో రాసుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు

 

భైంసాలో అల్లర్లపై ఇక్కడ దీక్ష చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అంతగా భావిస్తే… అక్కడికే వెళ్లి దీక్ష చేయాలని అన్నారు. ఎవరెన్ని చేసినా నిజామాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.ఎంపీ అరవింద్‌కు దమ్ముంటే అభివృద్ధిపై చర్చించేందుకు రావాలని సవాలు విసిరారు. నిజామాబాద్‌ మేయర్‌ సీటును ఎంఐఎంకు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ రెడీ అయ్యారని అరవింద్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. పరోక్షంగా టీఆర్ఎస్ గెలుపు ఖాయం చేశారని వ్యాఖ్యానించారు. స్థానిక మేయర్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటరే అవుతారనీ, ఎంఐఎంకు ఇచ్చే ప్రసక్తే లేదని గణేష్‌ గుప్తా తేల్చి చెప్పారు.

"
"