జగన్ మరో సంచలన నిర్ణయం.. తలపట్టుకున్న అధికారులు

వైఎస్ జగన్ సంచలన నీర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల తీరుపై పలు రకాల  మార్పులు చేశారు.  ఏవరు ఉహించని విధంగా నీర్ణయాలు  తీసుకున్నాడు.  అసలు జగన్  తిసుకున్న  నిర్ణయానికి అందరు షాక్ అవుతున్నారు.ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లో సగం వాటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించారు. ఈ కోటాలోనూ 50 శాతం మహిళలకే కేటాయించాలని ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల విధివిధానాలపై సమీక్షించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర స్థాయిలో జీఏడీ ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను జగన్‌ ఆదేశించారు. కార్పొరేషన్‌కు అనుబంధంగా జిల్లాల్లో వివిధ స్థాయిల్లో విభాగాలుండాలని సూచించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి నేతృత్వం వహించే ఈ జిల్లా స్థాయి విభాగానికి కలెక్టర్‌ ఎక్స్‌ అఫీషియో కన్వీనర్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో కార్పొరేషన్‌ ఉండాలన్నారు. అందరికీ ఒకే రకమైన నియమ నిబంధనలుంటాయని చెప్పారు. ప్రభుత్వ శాఖలన్నింటిలోనూ ఒకే పనికి ఒకే వేతనం ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌ పద్ధతుల్లో జీతాల చెల్లింపులు జరగాలని సూచించారు.

పోర్టల్‌ ద్వారా నియామకాలు జరపాలన్నారు. నియామకాల్లో అందరికీ అవకాశాలు దక్కకపోవడం, పనికి తగిన వేతనం లభించకపోవడం, సకాలంలో జీతాలు రాకపోవడంలాంటి సమస్యలు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఎదురుకాకూడదన్నారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లో ఈ మేరకు న్యాయం జరగడానికి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ నెల 16న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఔట్‌ సోర్సింగ్‌పై స్పష్టమైన విధానంపై నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. కాగా, ప్రస్తుతం పనులకు సంబంధించి రూ.100 కోట్లు దాటితే రివర్స్‌ టెండర్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించామని, కానీ వస్తు, సేవల వినియోగంలో మాత్రం ఇంకా స్పష్టమైన విధానాన్ని అమలు చేయలేకపోతున్నామని ఈ సమావేశంలో జగన్‌ అభిప్రాయపడ్డారు. వస్తు సమీకరణ, సేవల వినియోగంలోనూ ఒక విధానాన్ని అమలు చేయాలని అదేశించారు. ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ కోసం అన్ని పోర్టళ్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.

రాష్ట్రంలో మరింత పారదర్శకంగా రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కనీసం ఐదుగురు, లేదా పాల్గొనేవారిలో 60 శాతం (అంటే పది మంది పాల్గొంటే ఎల్‌-1 నుంచి కనీసం ఆరుగురు) రివర్స్‌ వేలంలో పాల్గొనేలా అవకాశం కల్పించాలని సీఎం సూచించారు. ప్రభుత్వ సొమ్ము ఆదా చేయడయే లక్ష్యంగా అన్ని విభాగాలు నిర్ణయాలు తీసుకోవాలన్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో రూ.10 లక్షల నుంచి రూ.100కోట్ల దాకా రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లే కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొద్దామని జగన్‌ వెల్లడించారు. ఇందుకోసం విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిటీ సమన్వయం కోసం ఒక ఐఏఎస్‌ అధికారిని నియమిస్తామని, ఆయన శాఖాధిపతులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహిస్తారని సీఎం వెల్లడించారు. రూ.100 కోట్ల పైబడ్డ కాంట్రాక్టు పనులను ముందస్తు న్యాయ సమీక్షకు నివేదించడం ద్వారా దేశంలో అత్యుత్తమ పారదర్శక విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌ఎస్‌ రావత్‌, జీఎడీ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, సాంఘిక, సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్‌, సీఎంవో కార్యదర్శి సాల్మన్‌ ఆరోకియా రాజ్‌ తదితరులు సమావేశమయ్యారు.

"
"