జగన్ ని ప్రసన్నం చేసుకుంటున్న ఢిల్లి పెద్దలు..? జగన్ పిలుపు కోసం ఎదురుచుపులు…

ఢిల్లీ ఓట‌మితో జ‌గ‌న్ ని శ‌ర‌ణు వేడిన మోడీ
జ‌గ‌న్ స‌ల‌హాలు తీసుకోనున్న ప్ర‌ధాని
త‌న కేబినెట్‌లో చేరాలంటూ ఆహ్వానం
విజ‌యసాయిరెడ్డితోపాటు మ‌రో ఇద్ద‌రికి మంత్రి ప‌ద‌వులు ఆఫ‌ర్‌
మూడు రాజ‌ధానుల విజ‌య‌ర‌హ‌స్యం తెలుసుకోనున్న మోడీ
జ‌గ‌న్ ఫీడ్ బ్యాక్ తో అన్ని రాష్ర్టాలకూ మూడు రాజ‌ధానులుండాల‌నే నినాదంతో వెళ్ల‌నున్న బీజేపీ

 

 

ఏపీ సీఎం జ‌గ‌న్‌ని ప్ర‌ధాన‌మంత్రి మోడీ శ‌ర‌ణు వేడారు. నిన్న‌టివ‌ర‌కూ జ‌గ‌న్ ఢిల్లీ వెళితే అపాయింట్‌మెంట్ కోసం ముప్పుతిప్ప‌లు పెట్టిన కేంద్ర పెద్ద‌లు ఇప్పుడు వారే రెడ్‌కార్పెట్ ప‌రిచి మ‌రీ జ‌గ‌న్‌ని ఢిల్లీకి ఆహ్వానిస్తున్నారు. ఢిల్లీలో త‌గిలిన దెబ్బ‌తో జ‌గ‌న్ విలువ తెలుసుకున్న మోడీ-షాల ద్వ‌యం ఏపీ సీఎమ్మే త‌మ‌కు ఇక గ‌తి అంటు డిసైడ్ అయ్యారు.
ఢిల్లీలో గెలుపు ఆప్‌దీ కాదు, కేజ్రీవాల్‌ది కాదు. ముమ్మాటికీ ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చ‌ల‌వ వ‌ల్లే ఢిల్లీలో ఆప్ గెల‌వ‌గ‌లిగింది. జ‌గ‌న్ త‌న వ్యూహ‌క‌ర్త అయిన ప్ర‌శాంత్ కిశోర్‌ని కేజ్రీవాల్‌కి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా సూచించారు. అలాగే జ‌గ‌న్ మేనిఫెస్టో, హామీలు, న‌వ‌ర‌త్నాల‌ను కూడా ఢిల్లీలో తాము గెలిస్తే అమ‌లు చేస్తామ‌ని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. దీంతో ఏపీలో కంటే మ‌రింత మెజారిటీతో కేజ్రీవాల్ గెల‌వ‌గ‌లిగారు. ఆప్ అద్దిరిపోయే విజ‌యానికి సూత్ర‌ధారి అయిన జ‌గ‌న్‌ను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో మోడీ-షాలు ప‌డ్డారు. రాజ్య‌స‌భ‌లో బీజేపీ బ‌లం అంతంత‌మాత్ర‌మే. ఇది పెంచుకోవాలంటే జ‌గ‌న్ అవ‌స‌రం బీజేపీకి త‌ప్ప‌నిస‌రి. మ‌రోవైపు ఒక్కో రాష్ర్టం క‌మ‌ల‌నాథుల గుప్పిట్లోంచి చేజారిపోతోంది. ఈ ద‌శ‌లో కుర్రాడైన జ‌గ‌న్ దూకుడు వ్యూహాలు త‌మ పార్టీకి ప‌నికొస్తాయ‌నే ఆలోచ‌న‌తో మోడీ జ‌గ‌న్‌కి ఆహ్వానం పంపారు.ప్ర‌ధాని మోడీ ఆహ్వానం మేర‌కు సీఎం జగన్ ఢిల్లీ చేరుకుని ఆయ‌న‌తో భేటీ కానున్నారు. అమరావతి, మండలి రద్దు అంశాలపై చర్చించ‌నున్నారు. అమిత్‍షాతోనూ జగన్ భేటీ అవుతార‌ని తెలుస్తోంది. ఢిల్లీలో ఓటమి తరువాత జగన్ ప్రాముఖ్యత గుర్తించిన కేంద్రం మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌తో తెలుగుదేశం పార్టీని ముప్పుతిప్ప‌లు పెడుతున్న తీరు గురించి, ఆ వ్యూహం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాల‌నుకుంటున్నార‌ని తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలు అస్స‌లు ఉండ‌కూడ‌ద‌నే ల‌క్ష్యంతో ప‌నిచేస్తోన్న బీజేపీకి ప్రాంతీయ పార్టీల బ‌లోపేతం అవ్వ‌డం..ఆ పార్టీల‌న్నింటికీ క‌లిపి కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేయ‌గ‌ల శ‌క్తి జ‌గ‌న్‌కి ఉంద‌ని, అందుకే ముందుగా జ‌గ‌న్‌ని ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు బీజేపీ నేత‌లు. పార్టీలు బలపడుతున్న నేపథ్యంలో జగన్ ఏపీలో అమ‌లు చేయాల‌నుకున్న ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ పేరుతో బ‌హుళ‌రాజ‌ధానుల అంశాన్ని బీజేపీ అస్ర్తంగా వాడుకోవాల‌ని డిసైడ్ అయ్యింది.

 

ప్రాంతీయ పార్టీలు బలపడుతున్న చోట బహుళ రాజధానులు అంశాన్ని అస్త్రంగా మార్చుకోవాలనుకుంటోంది. దేశానికి కూడా మూడు రాజధానులు ప్రతిపాదన తీసుకొచ్చి ప్రాంతీయ పార్టీల స‌హ‌కారంతో బ‌ల‌హీన‌ప‌డుతున్న‌ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చెయ్యాలని క‌మ‌ల‌నాథులు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ ప్ర‌ణాళిక అమ‌లులో బీజేపీకి జ‌గ‌న్ స‌హ‌క‌రిస్తే జ‌గ‌న్ త‌ర‌ఫున ఢిల్లీలో లాబీయింగ్ న‌డుపుతున్న విజ‌య‌సాయిరెడ్డికి మంత్రిప‌ద‌వి ఆఫ‌ర్ చేస్తున్నారు. అలాగే మిథున్‌రెడ్డితోపాటు మ‌రొక బీసీకి మంత్రి ప‌ద‌వులు ఇస్తామ‌నే ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేశారు.
జ‌గ‌న్ తీసుకున్నమూడు రాజ‌ధానులు, శాస‌న‌మండ‌లి ర‌ద్దు, నిర్బంధ ఇంగ్లీషు మీడియం అమ‌లు వంటి అంశాల‌న్నింటిలోనూ బేష‌ర‌తుగా కేంద్రం మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని మోడీ-షాలు హామీ ఇవ్వ‌నున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.

"
"