జగన్ పై అనుమానాలు అసలు విషయం ఇదేనా..?

చంద్ర‌బాబు ద‌గ్గ‌ర గ‌తంలో ప‌ని చేసిన ఒక పీఎస్ వ‌ద్ద దొరికిన 2 ల‌క్ష‌ల‌కు పైగా న‌గ‌దును చంద్ర‌బాబు అక్ర‌మాలు 2 వేల కోట్లంటూ ప్ర‌చారం చేస్తున్న జ‌గ‌న్‌కి ఓ సూటి ప్ర‌శ్న‌. జ‌గ‌న్ వ‌ద్ద ప‌నిచేసిన కెమెరామెన్ వంశీ త‌న భార్య‌ని చంపేశాడు. అంటే వంశీ జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఇప్పుడూ..చంపిన‌ప్పుడూ ప‌నిచేస్తున్నాడు కాబ‌ట్టి జ‌గ‌నే ఈ హ‌త్య‌కు కార‌కుడా? 5 రోజుల ఐటీ దాడుల్లో ఏమీ దొర‌క‌ని ఒక మాజీ పీఎస్ మీద జ‌రిగిన ఐటీ దాడిని చంద్ర‌బాబుపైకి బ‌ద‌లాయిస్తూ విష‌ప్ర‌చారం చేయ‌డం దురుద్దేశ‌పూరితం అని అర్థం అవుతోంది. ఈ లెక్క‌న జ‌గ‌న్ ప‌ర్స‌న‌ల్ కెమెరామెన్ వంశీ త‌న భార్య‌ను చంప‌డంలోనూ జ‌గ‌నే కీల‌క‌పాత్ర‌ధాని సూత్ర‌ధారి అయ్యుండాలి.క‌మీష‌న‌ర్లు వ‌స్తుంటారు పోతుంటారు. చంటిగాడు లోక‌ల్ అని పూరిజ‌గ‌న్నాధ్‌ ఇడియ‌ట్ సినిమాలో ర‌వితేజ‌తో ప‌లికిస్తాడు.

 

సేమ్ టు సేమ్ పీఏలు, పీఎస్‌లు వ‌స్తుంటారు, పోతుంటారు..కానీ చంద్ర‌బాబు స్వ‌చ్ఛ‌మైన నేత‌గా 40 ఏళ్ల రాజ‌కీయ జీవితం కొన‌సాగింది. ఒక ముఖ్య‌మంత్రిగా, ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ప‌నిచేసేట‌ప్పుడు ఆయా నేత‌ల‌కు ప్ర‌భుత్వం వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శులను కేటాయిస్తుంది. అటువంటి పీఎస్‌లు చంద్ర‌బాబు వ‌ద్ద ఇప్ప‌టివ‌ర‌కూ 15 మందికిపైగానే చేశారు. వీరిలో ఈ మాజీ పీఎస్ ఒక‌రు. అంతే. అంత‌కుమించి ఏ బంధ‌మూ లేదు. లేదు, కాదు చంద్ర‌బాబు వ‌ద్ద గ‌తంలో ప‌నిచేసిన వ్య‌క్తి కాబ‌ట్టి చంద్ర‌బాబుకు సంబంధం ఉంది అని వైకాపా మంత్రులు వాదిస్తే..జ‌గ‌న్ ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న‌ప్పుడే భార్య‌ను చంపిన వంశీ.. తానే చంపాన‌ని ఒప్పుకున్నాడు. ఆ త‌రువాత జైలుకెళ్లాడు. బెయిల్‌పై వ‌చ్చాడు. ఒక ఆడ‌కూతురిని అత్యంత దారుణంగా చంపేసిన వంశీని మ‌ళ్లీ త‌న ప‌ర్స‌న‌ల్ కెమెరామెన్‌గా జ‌గ‌న్ పెట్టుకున్నాడు. అంటే వంశీ త‌న భార్య‌ను హ‌త్య‌చేసేందుకు, జైలు నుంచి బ‌య‌ట‌కొచ్చేందుకు మొత్తం స‌హ‌కారం అందించింది జ‌గ‌నేన‌ని స్ప‌ష్టం అవుతోంది.వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఓదార్పుయాత్ర చేసిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న‌ వ‌ద్ద వ్యక్తిగత కెమెరామెన్ వంశీ ప‌నిచేసేవాడు.

 

ఆయ‌న భార్య అనుమానాస్ప‌దస్థితిలో మృతి చెందింది. అయితే తన భార్యను తానే చంపేశానని వంశీ పోలీసులు జరిపిన విచారణలో వెల్ల‌డించాడు. తల్లిదండ్రులు, సోదరి, బావతో కలిసి త‌న భార్య‌ వరలక్ష్మిని చంపి ఓ కాలువ పక్కన పాతిపెట్టాన‌ని చెప్పాడు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే తన భార్య అదృశ్యమైందని ఆ రోజే కృష్ణా జిల్లా నాగాయలంక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసిన‌ట్లు ఒప్పుకున్నాడు. ఈ కేసులో వంశీ అరెస్ట‌య్యాడు. ఆ త‌రువాత బెయిల్‌పై విడుద‌లై మ‌ళ్లీ జ‌గ‌న్ వ‌ద్దే ప‌ర్స‌న‌ల్ కెమెరామెన్‌గా చేరాడు.

"
"