ఇరకాటంలో పడ్డ యడ్యూరప్ప…

జేడీఎస్ అధినేత కుమారస్వామి కుమారుడు నిఖిల్ పెళ్లి వివాదం యెడ్యూరప్ప మెడకు చుట్టుకుంటోంది. పెళ్లికి అనుమతి ఎలా ఇచ్చారని కర్ణాటక హైకోర్టు యెడ్డీ సర్కారును ప్రశ్నించింది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారని ప్రశ్నించింది. వెంటనే జవాబివ్వాలని కోరింది.

 

ఈ నెల 17న బెంగళూరు రామ్‌నగర్ ఫామ్‌హౌస్‌లో కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి క్రిష్ణప్ప మనవరాలు రేవతితో నిఖిల్ వివాహం జరిగింది. పెళ్లిలో బంధువులు మాస్కులు ధరించకపోవడం, సామాజికదూరం పాటించకపోవడంతో రచ్చ మొదలైంది. వాస్తవానికి నిఖిల్ పెళ్లి వివాదంపై చర్యలు తీసుకుంటున్నామని యెడ్డీ సర్కారు తొలుత వెల్లడించింది. ఆ తర్వాత ఎవరెంత గొంతు చించుకున్నా మళ్లీ ఆ ఊసెత్తలేదు. తాజాగా కర్ణాటక హైకోర్టు ఈ వివాదంపై స్పందించాలని కోరడంతో యెడ్డీ సర్కారు చిక్కుల్లో పడింది.

"
"