వైఎస్ జగన్ తో హైపవర్ కమిటి భేటీ… రాజధానిపై క్లారిటీ ఇస్తారా..?

ఏపీలో రాజధాని ఆంశంలో ఇప్పుడు  తీవ్ర చర్చ జరుగుతుంది.  అసలు రాజధాని విషయంలో ఏం జరుగుతుందో ఏవరికి ఏం ఆర్థం కానీ  పరీస్థీతులు వున్నాయి.ఏపీ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సందర్భం రానే వచ్చేసింది. రాజధానిపై నియమించిన హైపవర్ కమిటీ నేడు సీఎం జగన్‌తో భేటీ కానుంది. ఏపీలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై చర్చించేందుకు ఏర్పాటైన ఈ కమిటీ.. సీఎం క్యాంపు కార్యాలయంలో రాజధానిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనుంది. అంతేకాదు.. రాజధాని రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు.

 

జీఎన్‌ రావు, బీసీజీ నివేదికలను పరిశీలించిన హైపవర్‌ కమిటీ.. ఇప్పటికే మూడు సార్లు సమావేశమై విస్తృతంగా చర్చలు జరిపారు. అయితే.. సీఎంతో భేటీ సందర్భంగా రాజధాని తరలింపుపై, అమరావతి రైతుల సమస్యలపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. విశాఖలో సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తే.. అక్కడికి తరలివెళ్లే ఉద్యోగులకు కల్పించాల్సిన సౌకర్యాలపైనా భేటీలో చర్చించనున్నారు.రాజధాని తరలింపు ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించాలి? ఎప్పటికి పూర్తి చేయాలి? తదితర అంశాలపైనా భేటీలో ప్రస్తావించనున్నారు. ఇదిలా ఉండగా, రాజధాని అంశంపై ఈ నెల 20న ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది.

"
"