పార్టీ మార్పుపై వైసీపీ చెంప చెళ్లుమ‌నిపించే ఆన్స‌ర్ ఇచ్చిన గొట్టిపాటి

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఇప్పటికే పలువురు టీడీపీకి చెందిన ముఖ్యనేతలు అటు బీజేపీ.. ఇటు వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.టీడీపీకి చెందిన న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు పార్టీ మార‌డంతో ప్రారంభ‌మైన ఈ వ‌ల‌స‌ల ప‌ర్వం ఆగ‌డం లేదు. ఇప్ప‌టికే గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్ పార్టీ మార‌డంతో అదే బాట‌లోనే మరికొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా టీడీపీకి టాటా చెప్పబోతున్నారని.. వారిలో ప్ర‌కాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూడా ఉన్నారని వార్తలు గుప్పుమన్నాయి.అయితే పార్టీ మార్పుపై ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆయన లాబీల్లో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చుకున్నారు.

త‌న‌కు పార్టీ మారే ఆలోచనే లేదు… నా రాజకీయ వైఖరి లో మార్పులేదు. బయట ఏదో ప్రచారం జరుగుతోంది. నేను పార్టీ మారట్లేదు. పార్టీ మారే ఆలోచన నాకు లేదు. నా క్వారీల్లో అధికారులు తనిఖీలు చేశారు. దానివలన ఇబ్బందులు ఉన్నా అందుకోస‌మే తాను పార్టీ మార‌న‌ని చెప్పారు.ఇక త‌న ఆస్తులు, క్వారిల‌పై ఎన్ని దాడులు జరిగినా నా వైఖరిలో మార్పు లేదు. క్వారీ వ్యాపారం మా కుటుంబ వ్యాపారం. 1990 నుంచి మా నాన్న హయాం నుంచి క్వారీ వ్యాపారం చేస్తున్నాం అని గొట్టిపాటి తేల్చిచెప్పారు. ఇక గొట్టిపాటి గ‌తంలో వైసీపీ నుంచి వ‌చ్చిన వ‌క్తి కావ‌డంతో ఆయ‌న్ను తిరిగి ఎలాగైనా టీడీపీలోకి తీసుకు వెళ్లాల‌ని వైసీపీ ఓ మైండ్ గేమ్ ఆడుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఇక ఇప్పుడు గొట్టిపాటి పార్టీ మార‌న‌ని నేరుగా క్లారిటీ ఇవ్వ‌డంతో వైసీపీ పుకారు రాయుళ్ల నోటికి తాళం ప‌డిన‌ట్ల‌య్యింది.

"
"